OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. మలయాళం నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కొంచెం ఎక్కువగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ మలయాళం సినిమాలను మన ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీలో ఇద్దరు అన్నదమ్ములు కిరాయి రౌడీలుగా ఉంటారు. ఒక ఎమ్మెల్యే వీళ్లను వాడుకుంటూ ఉంటాడు. ఆ తరువాత ఒక వ్యక్తి వల్ల వీళ్ళ జీవితాలు మారిపోతాయి. ఈ మలయాళం మూవీ చాలా ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పంత్రాండు’ (Panthrandu). 2022 లో విడుదలైన ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి లియో తాడ్డియస్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వినాయకన్, దేవ్ మోహన్, షైన్ టామ్ చాకో, లాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఇద్దరు అన్నదమ్ములు ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తుంటారు.చాపలు పట్టుకునే వృత్తిలో ఉన్నా, ఎక్కువగా ఎమ్మెల్యే చెప్పే పనులే చేస్తుంటారు. వీళ్ళ ద్వారా ఎమ్మెల్యే కూడా డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు. అప్పుడప్పుడు ఈ అన్నదమ్ములు చేసిన నేరాలకు, జైలుకు కూడా వెళ్లి వస్తుంటారు. ఈ అన్నదమ్ములకి, తల్లితో పాటు ఒక చెల్లి కూడా ఉంటుంది. వీళ్ళు చేసే పనులు చెల్లికి అస్సలు ఇష్టం ఉండదు. అదే ఊరికి ఇమ్మానియేల్ అనే వ్యక్తి స్నేహితుడిని కలవడానికి వస్తాడు. ఈ మూవీలో ఇమ్మానియేల్ క్యారెక్టర్ చాలా మిస్టరీగా ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్యే ఒక వ్యక్తిని చంపమని ఈ అన్నదమ్ములకు చెప్తాడు. వాళ్లు అతన్ని చంపి, పూడ్చిపెట్టి వెళ్లిపోతుంటారు. అప్పుడు ఇమ్మానియేల్ ఆ వ్యక్తిని బయటకు తీసి కాపాడుతాడు. ఇది గ్రహించిన రౌడీ ఇమ్మానియేల్ ను కొట్టడానికి వస్తాడు. ఏమవుతుందో ఏమో అతడు అప్పటినుంచి మంచి వాడిగా మారిపోతాడు.
మర్డర్లు చేయడానికి అన్న ఒప్పుకోకపోవడంతో, ఆ పనిని తమ్ముడు చేయడానికి వెళ్తాడు. అన్న వద్దని ఎంత చెప్పినా తమ్ముడు వినకుండా వెళతాడు. ఎమ్మెల్యే కూడా తమ్ముణ్ణి ప్రోత్సాహిస్తాడు. ఒకసారి తమ్ముణ్ణి కొంతమంది కత్తులతో దాడి చేస్తారు. అప్పుడు ఇమ్మానియేల్ అతన్ని కాపాడుతాడు. ఆ తరువాత ఇమ్మానియేల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి, వాళ్లతో అటువంటి పనులు చేపించొద్దని వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఈ మూవీలో క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. చివరికి తమ్ముడిలో కూడా మార్పు వస్తుందా? ఆ ఇమ్మానుయేల్ ఎవరు? ఎమ్మెల్యే వీళ్లను వదిలిపెడతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పంత్రాండు’ (Panthrandu) ఆనే ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడండి.