Mitramandali:సాధారణంగా ప్రతి సినిమా కూడా విడుదల కాకముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోతాయి అన్న విషయం తెలిసిందే.. అయితే అన్ని సినిమాలకు ఇది జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. కొన్ని కొన్ని సినిమాలు విడుదలకు ముందే తమ సినిమా హక్కులను శాటిలైట్, ఓటీటీ వారికి అమ్మేస్తూ ఉంటారు . మరికొన్ని చిత్రాలు మాత్రం ఇలా ఓటిటి హక్కులు అమ్ముడుపోక.. డీల్ కుదరక ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకురావడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. అదేదో కాదు మిత్రమండలి.
ప్రియదర్శి (Priyadarshi ) , ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎం (Niharika NM) జంటగా నటించిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరొకవైపు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ 14వ తేదీన తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ , శాటిలైట్ హక్కులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. 9.5 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇందులో ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలు లేదా నెలలోపే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిత్రమండలి సినిమా విషయానికి వస్తే.. ప్రియదర్శి, విష్ణు, రాగ మయూర్ , నిహారిక ఎన్ ఎం తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం మిత్రమండలి. బన్నీ వాసు సమర్పించడం, అనుదీప్ తో పాటు ఇతర మిత్ర బృందం ఈ సినిమా వెనుక ఉండడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి. కానీ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు అనిపించడం లేదు.
also read:Bigg Boss 9: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. జంగ్లీ పట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్) కి తన కులం అంటే పిచ్చి. తన కులానికి చెందిన వాళ్ళు వేరే కులాల వాళ్ళ రక్తాన్ని ఎక్కించుకోవాల్సి వచ్చినా సరే వద్దని చెప్పే రకం. కులాంతర వివాహాలైతే ఇక అసలుకే ఒప్పుకోరు. అలాంటి నారాయణ తన కులం బలంతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అలా ఒక పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది.ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి తన కూతురు కిడ్నాప్ అయింది అంటూ ఎస్ఐ సాగర్ (వెన్నెల కిషోర్) సహాయంతో వెతకడం మొదలుపెడతారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో నిహారిక పారిపోవడం వెనుక అదే ప్రాంతానికి చెందిన చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ. ఐ), రాజీవ్ (ప్రసాద్) ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది? స్వేచ్ఛ కారణంగా ఆమె తండ్రి చేతిలో ఈ నలుగురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ? వీళ్ళను నారాయణ ఏం చేశాడు? ఇలాంటి సమయంలో నారాయణకు టికెట్ దక్కిందా..? దక్కితే ఆ ప్రాంత ప్రజలు ఈయనను గెలిపించారా? అనే విషయాలు చూడాలంటే తెరపై చూడాల్సిందే.