OTT Movie : హీరోల వారసులు సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది సక్సెస్ అయితే, మరికొంత మంది తట్టా,బుట్టా సర్దుకుంటారు. సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజస్ నటించిన హర్రర్ థ్రిల్లర్ సినిమా, థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా, ఈ ఏడాది ఓటీటీలో అందుబాటులో కి వచ్చింది. ఈ కథ ఆరుగురు స్నేహితులు గెస్ట్ హౌస్‌లో పార్టీ చేస్తూ, ఒక డేంజర్ గేమ్ ఆడుతారు. అయితే గేమ్ లో ఎవరైతే ఓడిపోతే, వాళ్ళు చనిపోతుంటారు. ఈ చిల్లింగ్ థ్రిల్ సినిమా ఏ ఒత్తిడిలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘దక్ష’ (Daksha) 2023లో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా. వివేకానంద విక్రంత్ దర్శకత్వంలో ఆయుష్ తేజస్, షోభన్ బోగరాజు, ఆయుష్ తేజస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం IMDbలో 8.3/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా హంగామా, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆరుగురు స్నేహితులు ఒక గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. వాళ్లు సంతోషంగా మద్యం తాగుతూ, చాసర్ అనే గేమ్ ఆడతారు. ఈ గేమ్ రూల్స్ ప్రకారం, ఎవరైనా గేమ్‌లో ఓడిపోతే, వాళ్లకు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందని అనుకుంటారు. మొదట అంతా ఫన్నీగా సాగుతుంది. కానీ తెల్లవారుజామున లేచి చూస్తే, వీళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇది చూసి స్నేహితులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ గేమ్‌లో ఓడిపోయినవాడు చనిపోతాడని వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్లంతా భయంతో కిల్లర్ ఎవరని సందేహంలో ఉంటారు. వీళ్ళంతా బయటికి వెళ్లలేక ఆ గెస్ట్ హౌస్‌లోనే చిక్కుకుంటారు.
Read Also : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్