BigTV English

OTT Movie : టీచర్ తో అలాంటి పనులు చేసే స్టూడెంట్… బుర్ర బద్దలయ్యే ట్విస్ట్ తో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : టీచర్ తో అలాంటి పనులు చేసే స్టూడెంట్… బుర్ర బద్దలయ్యే ట్విస్ట్ తో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : ఫీల్ గుడ్ సినిమాలను చూస్తున్నప్పుడు, ఎదో ఒక సమయంలో ఒక కన్నీటి బొట్టు కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. ఈ సినిమాలలో సన్నివేశాలు ఆలా హృదయాన్ని తాకుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో లవ్ స్టోరీని చుస్తే అలాగే అనిపిస్తుంది. ఇందులో ఒక అమెరికన్ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తుంది. అక్కడ ఒక బ్రిటిష్ యువకుడితో ప్రేమలో పడుతుంది. అయితే క్లైమాక్స్ ఊహించని ట్రాజెడీతో ముగుస్తుంది. ఇది ఫీల్-గుడ్ రొమాన్స్ ఇష్టపడే వారికి ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘My Oxford Year’ ఒక అమెరికన్ రొమాంటిక్ చిత్రం. దీనికి ఇయాన్ మోరిస్ దర్శకత్వం వహించారు. ఇందులో సోఫియా కార్సన్, కోరీ మైల్‌క్రీస్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 1 గంట 51 నిమిషాల నిడివితో, ఇంగ్లీష్ , జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఆడియోతో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమా 6.3/10 స్కోర్ ను పొందింది.


స్టోరీలోకి వెళితే 

అన్నా ఒక అమెరికన్ మహిళ. చిన్నప్పటి నుండి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనే కలతో ఉంటుంది. 24 ఏళ్ల వయసులో ఆమె స్కాలర్‌షిప్‌తో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌కు చదువుకోవడానికి వెళ్తుంది. అక్కడ విక్టోరియన్ పోయెట్రీ చదువుతూ తన జీవితాన్ని సెట్ చేసుకుంటుంది. ఆమెకు అమెరికాలో ఒక రాజకీయ నాయకుడి ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. దీంతో ఆమె జీవితం పర్ఫెక్ట్‌గా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె మొదటి రోజున జామీ డావెన్‌పోర్ట్ అనే బ్రిటిష్ యువకుడు తన కారుతో ఆమెపై బురదను చల్లడంతో వారి మధ్య శత్రుత్వం మొదలవుతుంది. తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సుకు జామీనే టీచర్ అని తెలుస్తుంది. దీనితో వారి మధ్య గొడవ మరింత పెరుగుతుంది. అయితే ఒక రోజు రాత్రి ఒక పబ్‌లో గడిపిన తర్వాత, వారు ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభిస్తారు. జామీ ఆమెను ఒక ప్రత్యేకమైన పుస్తకం ఇచ్చి ఆమెకు దగ్గర అవుతాడు. ఇక వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ విచిత్రంగా ఈ సంబంధం లైఫ్ లాంగ్ ఉండకూడదని ఒప్పందం చేసుకుంటారు.

Read Also : నల్లటి జంటకు తెల్లని బిడ్డ… ఇదెక్కడి విడ్డూరం సామీ… అనుమానంతో ఆ జంట చేసే పనికి ఫ్యూజులు అవుట్

అయితే జామీ ఆమె దగ్గర ఒక పెద్ద రహస్యాన్ని దాచి పెడతాడు. అతనికి చికిత్సకి నయం కాని క్యాన్సర్ ఉంటుంది. అన్నా మొదట జామీ మరొకరితో ఉన్నాడని అనుమానించి అతని ఇంటికి వెళ్తుంది. కానీ అతను కీమోథెరపీ చేయించుకుంటున్న విషయం తెలుస్తుంది. ఈ విషయం ఆమెను షాక్‌లోకి పడేస్తుంది. ఆమె ఆక్స్‌ఫర్డ్‌లో తన చదువు ముగిసే సమయానికి, అమెరికాకు తిరిగి వెళ్లి జాబ్ చేసుకోవాలా లేదా జామీతో ఉండాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో అన్నా జామీతో ఉండాలని నిర్ణయించుకుంటుంది. తన తల్లికి ఫోన్ చేసి జాబ్‌ను వదులుకుంటున్నట్లు చెబుతుంది. కానీ జామీ ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే అతనికి అనారోగ్యం వల్ల ఎక్కువ సమయం లేదని తెలుస్తుంది. ఇప్పుడు అన్నా, జామీ యూరప్‌లో ఒక అద్భుతమైన వెకేషన్‌ను గడుపుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. అయితే జామీ అనారోగ్యం తీవ్రమవడంతో, అతను అన్నాతో కలిసి ఉండగానే సంతోషంగా మరణిస్తాడు. ఆమె దుఃఖంలో మునిగిపోతుంది. ఆ తరువాత యూరప్‌లో పర్యటిస్తూ అన్నా అతని జ్ఞాపకాలతో జీవిస్తుంది.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×