E-Paper
Advertisement

OTT Movie : నల్లటి జంటకు తెల్లని బిడ్డ… ఇదెక్కడి విడ్డూరం సామీ… అనుమానంతో ఆ జంట చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : నల్లటి జంటకు తెల్లని బిడ్డ… ఇదెక్కడి విడ్డూరం సామీ… అనుమానంతో ఆ జంట చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : కామెడీ, ఎమోషన్స్ మిక్స్‌తో ఒక ఫీల్-గుడ్ మూవీ చూడాలనుకునేవాళ్లకి ఈ మలయాళ సినిమా బెస్ట్ ఛాయిస్. ఈ సినిమాలో ఒక చిన్న అనుమానం పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఈ మళయాళ సినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …

మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్

‘సంశయం’ (Samshayam) 2025లో విడుదలైన మలయాళ కామెడీ సినిమా. దీనికి రాజేష్ రవి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినయ్ ఫోర్ట్, లిజోమోల్ జోస్, షరఫుద్దీన్, ప్రియమ్వద కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక సామాన్య జంట జీవితంలో ఒక చిన్న సంశయం ఎలా పెద్ద గందరగోళం సృష్టిస్తుందనే ఆలోచన ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా 2025 మే 16న థియేటర్లలో విడుదలై, 2025 జూలై 24 నుంచి మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 6.4/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

వడకర అనే చిన్న పట్టణంలో మనోజ్ (వినయ్ ఫోర్ట్) అనే ఇండియన్ కాఫీ హౌస్ ఉద్యోగి, తన భార్య విమల (లిజోమోల్ జోస్)తో సంతోషంగా జీవిస్తుంటాడు. వీళ్లకి పెళ్లై మూడేళ్లు అవుతుంది. ఒక ఏడాదిన్నర క్రితం వీళ్లకి ఒక మగబిడ్డ కూడా పుడతాడు. అంతా సంతోషంగా సాగుతుంటే, ఒక రోజు విమలకి ఒక వింత సంశయం వస్తుంది. ఆమె బిడ్డ తెల్లగా పుట్టడమే ఇందుకు కారణం అవుతుంది. ఎందుకంటే మనోజ్, విమల కాస్త నల్లగానే ఉంటారు. ఇప్పుడు తమ బిడ్డ నిజంగా తమ బిడ్డేనా? ఈ సంశయం ఆమెని ఎందుకనో కలవరపెడుతుంది. ఈ డౌట్‌తో ఆమె మనోజ్‌తో చెప్తుంది. దాంతో మనోజ్ ఈ సంశయాన్ని క్లియర్ చేయడానికి ఒక మిషన్ స్టార్ట్ చేస్తాడు.మనోజ్ ఈ సంశయం వెనక నిజం తెలుసుకోవాలని బయల్దేరతాడు. కానీ అతని అజ్ఞానం, ఈగో, సమాజంలో ఏం చెప్తారో అనే భయం వల్ల విషయం మరింత గందరగోళంగా మారుతుంది. ఈ క్రమంలో అతని ప్రయాణం వేరే జంట, హారిస్ (షరఫుద్దీన్) ఫైజా (ప్రియమ్వద కృష్ణన్) జీవితాలతో ముడిపడుతుంది.

Read Also : ఇదేం మాయ రోగంరా అయ్యా… అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు వైరల్… పిచ్చెక్కించే మలయాళ సైకో థ్రిల్లర్

హారిస్, ఫైజా ఒక అర్బన్ కపుల్, వాళ్లు కూడా తమ కుటుంబ జీవితంలో సెటిల్ అవుతున్న టైంలో ఈ సంశయం వాళ్ల లైఫ్‌ని కూడా షేక్ చేస్తుంది. మనోజ్ తన భార్య సంశయాన్ని క్లియర్ చేయడానికి చేసే ప్రయత్నాలు, హారిస్-ఫైజా జీవితంలో వచ్చే ట్విస్ట్‌లు కథని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మొదట్లో కథ చాలా కామెడీగా సాగుతుంది. మనోజ్ అజ్ఞానం, అతని తికమక ప్రవర్తన సిల్లీ కామెడీ సీన్స్‌తో నవ్వు తెప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో కథ సీరియస్ అవుతుంది. ఈ సంశయం వల్ల రెండు కుటుంబాల జీవితాల్లో వచ్చే ఎమోషనల్ డైలమా, పిల్లలు ఎవరి సొంతం? రక్త సంబంధమా, ప్రేమతో పెంచిన బంధమా ముఖ్యం? అనే ప్రశ్నలు కథని ఎమోషనల్ డ్రామాగా మారుస్తాయి. హారిస్, ఫైజా జీవితంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, మనోజ్-విమల జీవితంలోని గందరగోళం కలిసి, కథని ఒక టచ్చింగ్ క్లైమాక్స్‌కి తీసుకెళ్తాయి. ఇక అసలు సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటే, ఈ కామెడీ సినిమాపై ఓ లుక్ వేయండి.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×