Test Jersey : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి.. టెస్ట్ క్రికెట్ లో జరిగే పలు విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో డౌట్ వస్తుంది మ్యాచ్ చూసే సమయంలో.. కొందరూ అసలు టెస్ట్ క్రికెట్ కి వైట్ డ్రెస్ నే ఎందుకు వేసుకుంటారు.. మిగతా క్రికెట్ కి వేరే డ్రెస్ లు వేసుకొని దీనికే ఎందుకు ఇలా వేసుకుంటారని ప్రశ్నలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రంగుల ప్రపంచం ట్రెండ్ నడుస్తుంటే.. టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఇంకా తెల్ల దుస్తులు ధరిస్తున్నారు..? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే అందుకు కొన్ని కారణాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Ravindra Jadeja : జడేజా దెబ్బకు.. షర్ట్ మార్చుకున్న ఇంగ్లాండ్ ఫ్యాన్
అందుకే వైట్ జెర్సీ..
సాధారణంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ అంటే.. మైదానంలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. వాస్తవానికి తెల్ల రంగు దుస్తులు ఆటగాళ్లకు కాస్త చల్లదనం ఇస్తాయి. ఎరుపు బంతి స్పష్టంగా కనిపించడానికి తెల్ల దుస్తులు సహాయపడుతాయి. మైదానంలో ఉన్న వాళ్లకు.. టీవీలో చూస్తున్నవాళ్లకు బంతి కనిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. టెస్ట్ క్రికెట్ లో ఎక్కువగా ఎరుపు రంగు బంతితోనే ఆడుతుంటారు. ఇది ఆకుపచ్చ మైదానంలో బాగా కనిపించాలంటే.. ఆటగాళ్లు ధరించే జెర్సీ సింపుల్ గా ఉండాలి. తెల్లు దుస్తులు ఎరుపు బంతికి వ్యతిరేకంగా కనిపిస్తాయి. అదే రంగు రంగుల జెర్సీలు వేసుకుంటే.. బంతి కనిపించకపోవచ్చు. అందుకే ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ లో తెల్ల జెర్సీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
అప్పటి నుంచే తెల్ల డ్రెస్ ట్రెండ్..
గతంలో ఆటగాళ్లు ఎవ్వరికీ నచ్చినట్టు వాళ్లు జెర్సీలు వేసుకొని ఆడేవారు. కానీ కొన్ని ఫొటోలలో కోట్స్, బ్రౌన్ ప్యాంట్ వేసుకున్న వాళ్లు కనిపించేవారు. తరువాత క్రమక్రమంగా ఆట ప్రొఫెషనల్ గా మారింది. అప్పటి నుంచే తెల్ల డ్రెస్ ట్రెండ్ అయింది. కౌంటీ మ్యాచ్ ల నుంచే ఇది ప్రారంభమైంది. ఆ తరువాత అన్ని దేశాల్లో ఇదే ఫాలో అయ్యారు. ఒక ఆటగాడు టెస్ట్ జట్టు టీమ్ లోకి అయినప్పుడు అతనికి ఓ స్పెషల్ టెస్ట్ క్యాప్ ఇస్తారు. ఇది ఎంతో గౌరవంగా భావిస్తారు. మైదానంలో వాళ్లు ఆ క్యాప్ వేసుకొని ఆడటం అనేది ఓ గర్వంగా ఉంటుంది. తెల్ల క్యాప్ పై ఓ నెంబర్ ఉంటుంది. అది ఆ జట్టు తరపున టెస్టుల్లో ఆరంగేట్రం చేసి ప్లేయర్ల సంఖ్యను సూచిస్తుంది. ఒకవేళ భవిష్యత్ లో టెస్ట్ మ్యాచ్ ల్లో రంగు రంగు దుస్తులు ఆమోదిస్తే… ఎవరు బాల్ కి కష్టం అవుతుంది. అప్పుడు తప్పనిసరిగ్గా వైట్ బంతిని ఉపయోగించాలి. వైట్ బాల్ తక్కువగా స్వింగ్ అవుతుంది. దీంతో బౌలర్లకు నష్టమే జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ లో ఉన్న చాలా ప్రత్యేకతలు మాయం అవుతాయి. కాబట్టి వైట్ డ్రెస్ నే ఇంకా కొనసాగిస్తున్నారు.