OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అదరగొడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళం సినిమాలకు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. దృశ్యం తో మొదలైన ఈ జాతర ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. బిజు మినన్ ప్రధాన పాత్ర పోషించిన ఒక సస్పెన్స్ క్రైమ్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు ‘నాళం మూర’ (Naalm Mura). సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక హత్య కేసులో, అనుమానితుడిగా ఉన్న ఒక వ్యక్తిని అధికారులు దర్యాప్తు చేస్తారు. అయితే త్వరలోనే అతను నేరస్థుడా లేదా, అతను ఇరికించబడ్డాడా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీకి దీపు అంతిక్కడ్ దర్శకత్వం వహించాడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జయేశ్ విదేశాలకు వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్తుంటాడు. అతనిని కారులో డ్రాప్ చేస్తామంటూ, అదే దారిలో వెళ్తున్నామని చెప్పి రాజు అతని స్నేహితులు జయేశ్ ని ఎక్కించుకుంటారు. ఆ తర్వాత జయేశ్ ను ఒక పాడు బడ్డ బిల్డింగ్ లోకి తీసుకెళ్తారు. నిజానికి రాజు అతని స్నేహితులు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్లు. సుమ అనే ఒక మహిళ హత్య కేసు మీద అనుమానంతో జయేశ్ ను విచారించడానికి తీసుకొస్తారు. అయితే అతని మీద మర్డర్ చేసినట్టు ఎలాంటి ఆధారం ఉండదు. తొందరగా విచారించి పంపించాలని, పై ఆఫీసర్ కూడా వీళ్లకు చెప్తాడు. అయితే జయేశ్ ఆ హత్య తను చేయలేదని చెప్తాడు. అతను చేసిన చిన్న చిన్న క్రైమ్ లను మాత్రమే ఒప్పుకుంటాడు. బంగారం స్మగ్లింగ్, రోడ్ యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటాడు. అయితే సుమను హత్య చేసినట్టు జయేశ్ ఒప్పుకొడు. పోలీసులు అతన్ని చూసి డైలమాలో పడతారు.
అనవసరంగా ఇతన్ని విచారిస్తున్నామా అని సందేహంలో పడతారు. ఆ తరువాత పోలీసులకి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. చివరికి ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు కనిపెడతారా? జయేష్ అమాయకంగా నటిస్తున్నాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నాళం మూర’ (Naalm Mura) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాలో బిజు మినన్ తన నటనతో మరోసారి అదరగొట్టాడు. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ మూవీ, మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరెందుకు ఆలస్యం ఫామిలీతో కలసి, ఈ వీకెండ్ మరోసారి ట్విస్ట్ లతో సాగిపోయే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.