Thriller Movie OTT : ఓటీటీ లో కొత్త కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు ముందుగా అనౌన్స్ చేసి ఓటీటీ లోకి వస్తే.. మరి కొన్ని సినిమాలు ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నరుడి బ్రతుకు నటన అనే మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ డిటైల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా నరుడి బ్రతుకు నటన సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ముందుగా ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన నరుడి బ్రతుకు నటన మూవీలో శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీకి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించాడు. శృతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అక్టోబర్ నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మంచి కథ సినిమాగా ప్రేక్షకులను మెప్పించింది. డబ్బే సర్వస్వం అనుకునే ఓ యువకుడి జీవితం తాలూకు విలువను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడన్నది డైరెక్టర్ మూవీలో చూపించాడు. ఈ మూవీ మొత్తం కేరళ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించారు డైరెక్టర్. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను సొంతం చేసుకుంది.
సరికొత్త మూవీగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శివ రామచంద్రవరపు కనిపించాడు. బాలుగాని టాకీస్, కారందోశతో పాటు పలు చిన్న సినిమాల్లో కథానాయకుడిగా కనిపించాడు. వకీల్‌సాబ్, మజిలీ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, హిట్ 2తో పాటు పలు తెలుగు మూవీస్‌లో నెగెటివ్ మరియు పాజిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. సినిమాలో నటించాలని ఎన్నో కలలు కంటాడు శివ అనే వ్యక్తి. నటనకు సంబందించిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం రాదు. ఆడిషన్స్‌లో అవమానాలు ఎదుర్కొంటాడు.సత్యలో యాక్టింగ్ టాలెంట్ లేదని అతడి తండ్రి కూడా అనుకుంటాడు. సినిమా కలను పక్కనపెట్టి జాబ్ చేసుకోమని సలహా ఇస్తాడు. నటుడు కావాలంటే ముందుగా మనిషిగా మారాలని, ఎమోషన్స్ గురించి తెలుసుకోవాలని స్నేహితుడు ఇచ్చిన సలహా ఇవ్వడంతో ఒంటరిగా కేరళకు వెళ్తాడు. సత్య దగ్గర ఉన్న డబ్బు కొద్దిరోజుల్లోనే అయిపోతుంది. ఫోన్ మిస్సవుతుంది. రిచ్ లైఫ్‌స్టైల్ అనుభవించిన సత్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తోంది. సల్మాన్ అనే ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతని పరిచయం తర్వాత జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతాయి అనేది సినిమా స్టోరీ. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..