AP Politics: కొద్దిగా ఛాన్స్ దొరికితే చాలు.. లడాయి పెట్టడమే కొందరి నైజం. అది కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండాలి. అప్పుడే మూడో వాడిగా ఉన్న లడాయి వ్యక్తికి ఆనందం. ఇదే స్ట్రాటజీ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చిన సమయంలో పాటించారు. అదెలాగో తెలుసా.. మన వారి మధ్యనే యుద్దాలకు ఉసిగొలిపారు. చిన్నగా దేశంపై వారి జెండా పాతేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మీకు తెల్సిందే. ఇదే తరహా స్కెచ్ వేసి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూటమిలో పుల్లలు పెట్టేందుకు రెడీ అయ్యారని పొలిటికల్ టాక్.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికే కారణం. అందుకే ఫలితాలు కూడా ఆ రేంజ్ లో ఈ మూడు పార్టీలకు దక్కాయి. కానీ స్ట్రచర్ మీద ఉన్న టీడీపీకి ప్రాణవాయువు అందించింది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయం స్వయాన చంద్రబాబే చెప్పారు. అఆ తర్వాత ధికారంలోకి వచ్చారు.. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. బీజేపీకి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇలాంటి సమయంలో పలు జిల్లాలలో విభేదాలు బయటకు పొక్కినా.. ఎవరికి వారు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నచ్చజెప్పుకున్నారు. ఇలా కూటమి ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన కూడా చేశారు. మరో పదేళ్లు సీఎంగా చంద్రబాబు ఉండాలన్నది తన అభిమతమని చెప్పేశారు. దీనితో జనసేన క్యాడర్ కొంత గుర్రుమన్నా, తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ గుర్రు కారణం తెల్సిందేగా.. అదేనండీ నెక్స్ట్ సీఎం పవన్ అంటూ క్యాడర్ కలలు కంటుంటే, పవన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రకటన చేయడమే. చివరకు మాత్రం కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ, జనసేన మధ్య మైత్రి బంధం బలంగా ఉందని చెప్పవచ్చు.
ఈ విషయం వైసీపీకి పెద్దగా మింగుడుపడని పరిస్థితి. ఎన్నికల ఫలితాలలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మళ్లీ పుంజుకొనే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా, పొలిటికల్ వాతావరణం అంతగా సహకరించడం లేదట. ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ కూటమి మాత్రం వైసీపీని ఇరుకున పెట్టేస్తుంది. తిరుమల లడ్డు వివాదం, కాకినాడ పోర్టు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ వలసలు కూడా వైసీపీకి తలనొప్పిలా మారాయి. దీనితో ఏమి చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ అధినాయకత్వం ఒక్కసారిగా రూట్ మార్చింది.. తన స్ట్రాటజీ మొదలు పెట్టింది.
కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు వస్తే చాలు తమకు ఎదురులేదన్నది వైసీపీ ఆలోచనగా పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. వచ్చే విభేదాలు ఏ తీరులో రావాలంటే, ఇక కూటమి మాటే వద్దనే రీతిలో రావాలి. అందుకు ఎవరు ప్లాన్ చేశారో కానీ వైసీపీకి సూపర్ ప్లాన్ తట్టింది. ప్లాన్ అమలు భాద్యత మాత్రం ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించినట్లుగా తాజా పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. దానికి ఒక కారణం ఉంది. అదే పవన్ ను పొగుడుతూ విజయసాయి రెడ్డి తాజాగా ట్వీట్స్, కామెంట్స్ పరంపర సాగించడమే.
ఇటీవల కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయం నుండి, విజయసాయి రెడ్డి టార్గెట్ గా టీడీపీ విమర్శల జోరు సాగిస్తోంది. ఈ కామెంట్స్ పై విజయసాయి రెడ్డి కూడా స్ట్రైట్ అటాక్ చేశారనే చెప్పవచ్చు. అంతటితో ఆగక డిప్యూటీ సీఎం హోదాలో గల పవన్ ను జాతీయ నేతగా పోల్చి, దేశవ్యాప్తంగా చరిష్మా పవన్ సొంతమంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు పవన్ యువకుడు కాబట్టి, ఏపీ లాంటి యువ రాష్ట్రానికి పవన్ సీఎం కావాలని ఉందని తన అభిమతం చెప్పారు. అలాగే సీఎం చంద్రబాబు కురువృద్దుడని ఆయన పాలన ఎందుకని కాక రాజేశారు.
దీనితో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు దత్త పుత్రుడంటూ, కుటుంబ పరమైన అంశాలపై కూడా పవన్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. ఇప్పుడు మాత్రం దేశ్ కి నేత అంటూ పొగడ్తలు కురిపించడంతో సీజ్ దిస్ కామెంట్స్ అనేస్తున్నారు జనసేన కార్యకర్తలు. అసలే మొన్నటికి మొన్న మరో పదేళ్లు సీఎంగా చంద్రబాబు ఉండాలని పవన్ ప్రకటన ఇస్తే, ఇప్పుడు సీఎంగా మీరే కావాలంటూ వైసీపీ నినాదం ఎత్తుకోవడం దేనికి సంకేతమని చర్చ జోరందుకుంది.
Also Read: Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్, స్పెషల్ ట్రైన్‌ల బుకింగ్స్ మొదలైపోయాయ్!
విజయసాయి రెడ్డి కామెంట్స్ తో జనసేనలో కూడా కొంత చర్చ సాగుతోందట. దోస్త్ మేరా దోస్త్ లా మెలుగుతున్న టీడీపీ, జనసేన మధ్య వార్ రావాలన్నదే విజయసాయి రెడ్డి అభిమతమా అనేది కూడా తేలని పరిస్థితి. కానీ విజయసాయిరెడ్డి కామెంట్స్ ను ఆధారంగా చేసుకొని జనసేన సోషల్ మీడియా.. ఔను మా నాయకుడే సీఎం అనే తరహాలో స్పీడ్ అయిందా.. టీడీపీ సోషల్ మీడియా కూడా వార్ స్టార్ట్ చేయడం ఖాయం. ఈ తరుణంలో కూటమి మధ్య విభేదాలు వచ్చాయంటే.. వైసీపీ అనుకున్న పని ఇక సులువేనని చెప్పవచ్చు.
అందుకే విజయసాయిరెడ్డి కామెంట్స్ ను ఎవరూ పట్టించుకోవద్దంటూ జనసేన అధినాయకత్వం తన క్యాడర్ కు సూచించినట్లు తెలుస్తోంది. జాగ్రత్తగా ఉందాం.. ప్రస్తుతం మనం అధికారంలోనే ఉన్నాం. మనకు పదవులు కాదు.. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం వైసీపీ వేసే వలలో చిక్కారో.. నెక్స్ట్ మన పరిస్థితి అంతేనంటూ జనసేన అప్రమత్తమైందట. ఏదిఏమైనా విజయసాయి రెడ్డి ట్వీట్ వెనుక, వైసీపీ వ్యూహం ఉందో లేదో కానీ అసలు స్కెచ్ మాత్రం, కూటమిని తెగ్గొట్టడమేనని ప్రచారం ఊపందుకుంది.