Dhanush Idli Kadai OTT Release Date: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం సినిమాలతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాయన్, ‘నిలవకు ఎన్ మై ఎన్నడి కోబమ్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాయన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసింది. ఇటీవల అంత యువ నటీనటులతో తెరకెక్కించిన ‘నిలవకు ఎన్ మై ఎన్నడి కోబమ్‘ మూవీని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు. జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో ఈ సినిమా విడుదలైంది.
హీరోగా సత్తా చాటిన ధనుష్.. దర్శకత్వంతోనూ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఇడ్లీ కడై‘. ధనుష్, నిత్యా మీనన్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. ఇడ్లీ కొట్టు పేరుతో తెలుగు విడుదల చేశారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా సాగిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించింది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్దమైంది.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చిది నెట్ఫ్లిక్స్. థియేటర్లలో తమిళ్, తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ భాషతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో మూవీ లవర్స్ అంత ఫుల్ ఖుష్ అవుతుంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ హీరో అయిన ధనుష్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ చిత్రాలతో సుపరిచితమైన ధనుష్.. సార్, కుబేర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
Also Read: Anasuya: అనసూయ కీలక ప్రకటన.. తన మేనేజర్ తొలగింపు..
శివ కేశవులు (రాజ్ కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఆ ఊళ్లో ఫేమస్. ఎంతో ఇష్టంగా చిన్న హోటల్ పెట్టి ఇడ్లీ చేసి అమ్ముతుంటాడు. శివ కేశవులు ఇడ్లీ కొట్టులో ఇడ్లీ చాలా రుచికరంగా ఉంటాయి. దీంతో ఊరంత ఆయన హోటల్ కే వస్తుంది. ఆ తర్వాత తన కుమారుడు మురళీ (ధనుష్) తండ్రి కొట్టుని పెద్ద హోటల్ గా మార్చి ఫ్రాంఛైజ్ మార్చాలని అనుకుంటాడు. అయితే తన చేత చేయని ఆ ఇడ్లీలను తన పేరుతో అమ్మడానికి ఇష్టపడడు. దీంతో ఉన్నతమైన జీవితం కోసం కలలు కన్న మురళీ బ్యంకాక్ వెళతాడు. అక్కడ బిజినెస్ పెట్టి బాగా సంపాదిస్తాడు. అక్కడే బ్యాంకాక్లో ప్రముఖ వ్యాపారవేత్త తన పార్ట్నర్ విష్ణువర్థన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లి నిశ్చయమవుతుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. మురళి తండ్రి శివ కేశవులు చనిపోతారు. తండ్రి చివరి కోసం ఇండియా వచ్చిన మురళి అనుకోని కారణాల వల్ల బ్యాంకాక్కి వెళ్లలేకపోతాడు. మరీ చివరి బ్యాంకాక్ వెళ్లాడా? లేదా? షాలిని కాదని నిత్యామీనన్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? షాలిని ఇండియా ఎందుకు వచ్చింది? కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==