E-Paper
Advertisement

బ్రేకప్ అయిన వాళ్ళంతా రెండో ఛాన్స్ కోసం… రమ్యకృష్ణ క్రేజీ రియాలిటీ షో… అన్నీ అలాంటి షోలే

బ్రేకప్ అయిన వాళ్ళంతా రెండో ఛాన్స్ కోసం… రమ్యకృష్ణ క్రేజీ రియాలిటీ షో… అన్నీ అలాంటి షోలే
Advertisement

Reality Shows on JioHotstar: వాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు సింగిల్స్ తెగ బెంగ పెట్టేసుకుంటారు. కానీ అలాంటి సింగిల్స్ కి, ముఖ్యంగా ముఫ్ఫై ఏళ్లు దాటిన వారికి, లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళకి తాజాగా ఓ షోలో ఛాన్స్ ఇచ్చి, యూత్ దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు మేకర్స్. ఈరోజు నుంచే JioHotstarVijayలో ప్రసారమవుతున్న సరికొత్త తమిళ డేటింగ్ రియాలిటీ షో. Second Love. ఈ షోలో 30 ఏళ్ల వయసులో ఉండి, గతంలో బ్రేకప్స్ లేదా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న 12 మంది సింగిల్స్… ఆరుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు పాల్గొంటారు. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక లగ్జరీ విల్లాలో కలిసి జీవించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బ్లైండ్ డేట్స్, విభిన్నమైన టాస్క్‌లు, చర్చల్లో పాల్గొంటారు. అచ్చం బిగ్ బాస్ లాగా అన్నమాట.

దీనికి రమ్యకృష్ణ, శృతిక అర్జున్ హోస్ట్‌లుగా వ్యవహరించగా… కంటెస్టెంట్లకు గైడ్‌లుగా ఉంటూ వారిని ముందుకు నడిపిస్తారు. ఈ షోలో పాల్గొనేవారు తమ పాత చేదు జ్ఞాపకాలను అధిగమించి, కొత్త భాగస్వామిని ఎంచుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడతారా లేదా అనేదే ఈ షో కథ. అయితే జీవితంలో రెండవ అవకాశం ఎంత ముఖ్యమో చూపించే ‘సెకండ్ లవ్’ లాంటి రియాలిటీ షోలు హాట్ స్టార్ లోనే మరికొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1. కాయల్ కుడంబం (Kayal Kudumbam)

Advertisement

తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కాన్సెప్ట్ కూడా ‘సెకండ్ లవ్’ లాగే ఉంటుంది. ఒక విల్లాలో ఉండే కొందరు వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాల చుట్టూ ఈ షో సాగుతుంది. గత బాధల నుంచి బయటపడి కొత్త బంధాలు ఏర్పరచుకోవడం దీని మెయిన్ థీమ్.

2. బిగ్ బాస్

తెలుగు, తమిళం, ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

3. టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (Temptation Island India)

Advertisement

ఈ హిందీ షో కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తమ ప్రేమ ఎంత నిజమైందో పరీక్షించుకోవడానికి ఒక విల్లాలోకి వస్తారు. అక్కడ ఉన్న ఇతర సింగిల్స్ వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ జంటలు కలిసి ఉంటాయా లేదా విడిపోతాయా అనేది ఈ షో కాన్సెప్ట్. ఇది రిలేషన్‌షిప్ టెస్ట్ షోగా పాపులర్ అయ్యింది.

4. స్ప్లిట్స్‌విల్లా (MTV Splitsvilla)

భారతదేశంలోనే పాపులర్ అయిన డేటింగ్ రియాలిటీ షో ఇది. యంగ్ సింగిల్స్ ఒక లగ్జరీ లొకేషన్‌లో కలిసి ఉంటూ, టాస్క్‌లు ఆడుతూ తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కునే ప్రయాణం ఇది. ఇందులో డ్రామా, ట్విస్టులు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.

5. లవ్ ఐలాండ్ (Love Island)

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఇంగ్షీషు డేటింగ్ షో ఇది. కొందరు సింగిల్స్ ఒక అందమైన విల్లాలో జంటలుగా మారి గేమ్ ఆడాలి. మధ్యమధ్యలో కొత్త కంటెస్టెంట్లు రావడం వల్ల పాత జంటల మధ్య వచ్చే మనస్పర్థలు, డ్రామా ఈ షో ప్రత్యేకత.

Read Also: బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తే సోకే వైరస్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

Tags

Related News

40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

అమ్మాయిని వెంటాడే టైర్… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్

డివోర్స్ తీసుకుని లేడీ డైరెక్టర్ సినిమా… పదేళ్ళ తర్వాత మరో మూవీతో భర్త కౌంటర్

అమ్మాయి కదాని సొళ్ళు కారిస్తే… కనికరం లేకుండా ఇదేం పని భయ్యా ? నిద్ర కరువయ్యే ట్విస్ట్

వెయ్యేళ్ళ నాటి భయంకరమైన శాపం వెంటాడితే… సీను సీనుకో ట్విస్టున్న సిరీస్

Big Stories

Advertisement
×