Telugu Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు వస్తుంటాయి. అందులో కొన్ని సినిమాలు రొమాంటిక్ సీన్స్, లవ్ జానర్ లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్ ను బాగా ఆకట్టుకొనే విధంగా సీన్లు ఉండేలా సినిమాలను మేకర్స్ తీసుకొని వస్తున్నారు. ఈ మధ్య లవ్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే అందులో బెస్ట్ రొమాంటిక్ సీన్స్, లవ్ ప్రపోజల్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి.. అందులో బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్స్ ఉన్న మూవీస్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రేమ గుడ్డిది అని కొందరి అభిప్రాయం.. ఎప్పుడు ఎవరి మనసులో ప్రేమ పుడుతుందో తెలియదు. కానీ ప్రేమను ప్రేమలాగా చూస్తే స్వర్గాన్ని చూడొచ్చు.. ప్రేమించుకోవడానికి ఒక రోజు ఉంటుంది అని మనం సాధారణంగా నమ్మం. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి ఈ మధ్య ఫారిన్ ట్రెండ్ ఫాలో అవ్వడం కామన్. లవ్ ప్రపోజ్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు.. అయితే సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్స్ ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం..
ఓయ్.. సిద్దార్థ్, బేబీ శ్యామిలి జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ వచ్చి చాలా ఏళ్లు పూర్తి అయిన కూడా సినిమా టీవీ లో వస్తే అతుక్కుపోయి చూస్తారు. ఇందులో పన్నెండవ గిఫ్ట్ నేనే.. నీతో జీవితాంతం ఉంటా..అని సిద్దార్త్ చెప్తాడు అది మూవీకి హైలెట్ అయ్యింది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో నువ్వు నా ప్రాణం తీసుకున్నావు.. కానీ నేను బ్రతికే ఉన్నా అని చెప్పే ఎమోషనల్ డైలాగ్ జనాలను బాగా అక్కట్టుకుంది. నిత్యామీనాన్, శర్వనంద్ ఈ మూవీలో జంటగా నటించారు..
అలాగే ప్రభాస్ బ్లాక్ బాస్టర్ మూవీ మిర్చి లో యాక్షన్ పార్ట్ మాత్రమే కాదు. రొమాంటిక్ టచ్ కూడా ఉంది. ప్రభాస్, అనుష్క ల మధ్య వచ్చే సీన్లు బాగా హైలెట్ అయ్యాయి. అందులో ఒక్క ఛాన్స్ ఇస్తావా.. జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా.. ఇప్పటికి ఇది ట్రెండ్ అవుతుంది.
ఇక సఖి లో సీన్స్ హైలెట్ అయ్యాయి.. అలాగే కొంతభంగారు లోకం, ఇడియట్, పోకిరి., ఏం మాయ చేసావే… ఆర్య, వీటితో పాటుగా ఎన్నో సినిమాల్లో ని లవ్ ప్రపోజల్ సీన్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అలాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఈ సినిమాలను ఎప్పుడు వచ్చిన మిస్ అవ్వకుండా చూస్తాము. ఆ సినిమాలను మళ్ళీ థియేటర్ లోకి రిలీజ్ చెయ్యాలని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాలు మనసును గెలుచుకున్నాయి. ఇప్పటికి అదే క్రేజ్ ను అందుకున్నాయి.. ఇక ఈ మధ్య ఓవర్ ఎక్స్పోజ్, రొమాన్స్, లేదంటే బూతు డైలాగ్ లు ఉంటాయి. విమర్శలు అందుకుంటున్నాయి.. ఈ ఏడాది బెస్ట్ రొమాంటిక్ మూవీ ఏదో చూడాలి..