BigTV English

OTT Movie : కిల్లర్ ను పట్టుకోవడానికి హెల్ప్ చేసే మంత్రగాడు… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

OTT Movie : కిల్లర్ ను పట్టుకోవడానికి హెల్ప్ చేసే మంత్రగాడు… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

OTT Movie : ఓటిటిలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా పోటీపడుతూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. సెన్సార్ నిబంధనలు కూడా లేకపోవడంతో, వీటిలో మసాలా కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. మైథాలజికల్ కంటెంట్ తో ప్రేక్షకుల మతి పోగోడుతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

భదూరి మోషాయ్ (చిరంజీత్ చక్రవర్తి) ఒక ప్రసిద్ధ ఆకల్టిస్ట్ గా ఉంటాడు. అతను చంద్రుడు ఎరుపు రంగులోకి వచ్చిన సమయంలో, ఒక అఘోరి తాంత్రికుడి నుండి వచ్చే భయంకరమైన మిస్టరీని ఎదుర్కొంటాడు. ఈ స్టోరీ మార్చురీ నుండి రెండు శవాలు అదృశ్యమవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఒక పోలీసు అధికారి కుమార్తె కూడా అదృశ్యమవుతుంది. పోలీసు అధికారి అమియా (గౌరవ్ చక్రవర్తి) అతని బృందం ఈ కేసును విచారిస్తారు, అప్పుడు వారు గెను అనే దుర్వాసన కలిగిన రాక్షసుడి గురించి తెలుసుకుంటారు. ఇది శవాలను సేకరించే ఒక తాంత్రికుడి ఆదేశంలో పనిచేస్తుంది. అమియా ఈ కేసును పరిష్కరించడానికి, భదూరి మోషాయ్ సహాయం తీసుకుంటాడు.


రక్త చంద్రుని సమయంలో ఎవరో ఇదంతా చేస్తున్నారని గ్రహిస్తాడు భదూరి మోషాయ్. ఇక్కడ భదూరి మోషాయ్ ఆ తాంత్రికుడితో ఒక అతీంద్రీయ శక్తి ద్వారా ఎదుర్కొంటాడు. కానీ ఆ తాంత్రికుడు దానిని గట్టిగా అడ్డుకుంటాడు. ఇక ఆ తాంత్రికుడి వల్ల ఏర్పడే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు భదూరి మోషాయ్ అడవిలో ఉన్న అతని దగ్గరికి వెళ్తాడు. చివరికి భదూరి మోషాయ్ ఆ తాంత్రికుడిని ఎదుర్కుంటాడా ? శవాలను తాంత్రికుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు ? పోలీసులు అతన్ని ఎలా పట్టుకుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బెంగాలీ సూపర్‌ న్యాచురల్ హారర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : చావక ముందే స్వర్గానికి వెళ్ళే మనుషులు… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్

 

హోయ్‌చోయ్ (hoichoi) లో

ఈ బెంగాలీ సూపర్‌ న్యాచురల్ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘నీకోష్ ఛాయ’ (Nikosh Chhaya). దీనికి పరంబ్రత చటర్జీ దర్శకత్వం వహించారు. ఇది సౌవిక్ చక్రవర్తి రాసిన కథ ఆధారంగా రూపొందింది. ఇది ‘పర్ణశవరిర్ షాప్’ అనే సిరీస్‌కు రెండవ పార్ట్ గా వచ్చింది. ఈ స్టోరీ భదూరి మోషాయ్ అనే ఒక ప్రసిద్ధ ఆకల్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. హోయ్‌చోయ్ (hoichoi) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2024 అక్టోబర్ 31న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×