Ntr : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఏ పాత్రలో అయిన ఇట్లే ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆయన సినిమాలు జనాలకు వినోదాన్ని పంచడంతో పాటుగా ఒక మెసేజ్ కూడా ఇచ్చేవి. అందుకే అన్నగారి సినిమాలు టీవీ లలో వస్తున్నాయి అంటే ఇప్పటికీ జనాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా కూడా సినిమాలు, రాజకీయ నాయకుడుగా ఆయన చేసిన సేవలు ప్రజలకు గుర్తిండి పోయాయి.. నిన్న ఆయన జయంతి సందర్బంగా తెలుగు ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.. ఊరు వాడల అన్నగారి పేరుతో హోరేత్తిపోయింది. తాజాగా ఎన్టీఆర్ కూడా తాతగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
తాత బాటలోనే మనుమడు..
నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయన అభిమానులతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ తాత గారి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ప్రతియేటా కనిపించే దృశ్యమే.. అయితే కళ్యాణ్ రామ్, యన్టీఆర్ ను కలసి చూసిన ఫ్యాన్స్ కు వారిద్దరూ తాత బాటలోనే పయనిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఒకరేమో నట నిర్మాతగా, మరొకరు నటునిగా తాత పేరు నిలుపుతున్నారనీ ఫ్యాన్స్ ఈ సోదరులను అభినందించారు.. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా పలు చిత్రాల్లో నటించి హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులోను ఎన్టీఆర్ తాత పేరు నిలబెట్టేలా గ్లోబల్ స్టార్ అయ్యాడు..
Also Read :మరోసారి అడ్డంగా బుక్కయిన రష్మిక.. ఇదిగో ప్రూఫ్…
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సినిమాలను నిర్మిస్తు బిజీగా ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు పలు జనరంజకమైన చిత్రాలను నిర్మించారు. ఆ చిత్రాలలో కొన్నిటిని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనూ రూపొందించి నటించారు. తరువాతి రోజుల్లో బాలకృష్ణ హీరోగా ఆయన అన్న హరికృష్ణ చిత్రాలు తెరకెక్కించారు. వాటిలోనూ పలు సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకునిగా ఆయన అన్న కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్నారు.. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు రూపొందించారు. దర్శకునిగానూ ఎన్టీఆర్అరుదైన విజయాలను చవిచూశారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని సాగుతోన్న బాలయ్య కూడా 2004లో ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ఆశించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ‘నర్తనశాల’ వెలుగు చూడలేదు. తాత అంటే ఎంత ప్రేమ ఎన్టీఆర్ కు నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద వచ్చిన జనాలను చూస్తే తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టుల తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ రీసెంట్గా అర్జున్ సన్నాఫ్ వైజంతి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలను నిర్మిస్తున్నాడు.