Kamal Haasan.. ప్రముఖ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Haasan), ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం థగ్ లైఫ్ (Thuglife). భారీ అంచనాల మధ్య జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శింబు(Simbu), త్రిష(Trisha ) కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మంగళవారం రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Sivaraj kumar) కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే “తమిళం నుండి కన్నడ పుట్టింది” అంటూ కమలహాసన్ చేసిన కామెంట్లకు ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మండిపడ్డ కర్ణాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప.. కమలహాసన్ భేషరుతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆయన వ్యాఖ్యలకు కమలహాసన్ స్పందించారు.
ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు – కమలహాసన్
కర్ణాటక నుంచి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్లు వస్తున్నవేళ కమల్ హాసన్ మాట్లాడుతూ..” అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలు. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు.. నేను ప్రేమతోనే అలా మాట్లాడాను. ఎంతో మంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యలలో మరో తప్పు ఉద్దేశం లేదు. తమిళనాడు ఒక అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరిని కూడా మిళితం చేసుకునే తత్వం తమిళనాడుకు ఉంది. ఓ మేనన్ (ఎం.జీ.రామచంద్రన్) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రెడ్డి (ఒమందూరు రామస్వామి రెడ్డియార్) సీఎం అయ్యారు. అటు మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహ రంగాచారి మనవరాలు (జయలలిత) కూడా తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికి వెళ్లదు మేము మీకు ఆశ్రయం కల్పిస్తాము అన్నారు. అటు రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు.. నాతో సహా దానిపై మాట్లాడే అర్హత వారికి లేదు. దీనిపై లోతైన చర్చను అటు చరిత్రకారులకు,, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకే నేను వదిలేస్తున్నాను” అంటూ కమలహాసన్ తెలిపారు.
తమిళం నుండి కన్నడ పుట్టింది – కమలహాసన్
ఇకపోతే చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్లో కమలహాసన్ మాట్లాడుతూ.. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదానికి కారణమైంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని ఈ విషయాలన్నీ కమలహాసన్ కు తెలియకపోవచ్చు అని కమలహాసన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.