OTT Movie : ఓటీటీలో ఒక హాలీవుడ్ మూవీ డిఫరెంట్ స్టోరీతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఉన్నట్టుండి మనుషులు మాయం అవుతుంటారు. ఇందులో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు స్వర్గంలో, నమ్మని వాళ్ళు భూమి మీద ఉండిపోతారు. ఈ స్టోరీ చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
రేఫోర్డ్ స్టీల్ (నికోలస్ కేజ్) అనే వ్యక్తి కమర్షియల్ ఎయిర్‌లైన్ పైలట్ గా డ్యూటి చేస్తుంటాడు. అతను తన భార్య ఐరీన్,కుమార్తె క్లోయీ,కొడుకు రే తో కలసి జీవిస్తుంటాడు. అయితే వీళ్ళ వైవాహిక జీవితం అంత సవ్యంగా ఉండదు. ఎందుకంటే ఐరీన్ ఇటీవల క్రైస్తవ విశ్వాసంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ఇది రేఫోర్డ్, క్లోయీలకి కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇక రేఫోర్డ్ తన భార్యతో సంబంధాన్ని విడిచిపెట్టి, ఫ్లైట్ అటెండెంట్ హాట్టీతో సన్నిహితంగా ఉంటాడు. ఈ క్రమంలో రేఫోర్డ్ ఒక రాత్రి లాస్ ఏంజిల్స్ నుండి లండన్‌కు విమానం నడుపుతుంటాడు. అకస్మాత్తుగా క్రైస్తవ మతాన్ని నిజాయితీగా విశ్వసించే వాళ్ళు, వారి పిల్లలు భూమి నుండి అదృశ్యమవుతారు. వాళ్ళ బట్టలు, వస్తువులు మాత్రమేభూమి మీద మిగిలిపోతాయి. రేఫోర్డ్ నడుపుతున్న విమానంలో కో-పైలట్ తో పాటు మరికొంతమంది ప్రయాణికులు అదృశ్యమవుతారు. దీనివల్ల ప్రయాణికులలో గందరగోళం ఏర్పడుతుంది.
ఇదే సమయంలో భూమిపై ఉన్న క్లోయీ తన తమ్ముడు రే అదృశ్యమైనట్లు గమనిస్తుంది. అంతేకాకుండా ఆమె తన తల్లి ఐరీన్ కూడా అదృశ్యమైందని తెలుసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అదృశ్యమవడంతో, నగరాల్లో గందరగోళం, దోపిడీలు, హింస నెలకొంటాయి. మరొవైపు క్లోయీ తన తండ్రిని కలవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో రేఫోర్డ్ తన విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి పోరాడుతాడు. ఎందుకంటే ఈ విమానంలో ఇంధనం లీక్ అవుతూ ఉంటుంది. చివరికి రేఫోర్డ్ విమానాన్ని సురక్షితంగా భూమి పైకి లాండ్ చేస్తాడా ? క్లోయీ తన తండ్రిని కలుస్తుందా ? మాయమైన వాళ్ళు ఏమౌతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పాకిస్థాన్ చెరలో ఇండియన్ అమ్మాయి … ఓటిటిలో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్
యూట్యూబ్ (Youtube) లో
ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లెఫ్ట్ బిహైండ్’ (Left Behind). 2014 లో వచ్చిన ఈ సినిమాకి విక్ ఆర్మ్ స్ట్రాంగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్రైస్తవ మతం గురించి ఎక్కువగా చూపించారు. ఈ సినిమా టిమ్ లాహే, జెర్రీ బి. జెంకిన్స్ రాసిన పుస్తకం ఆధారంగా తీయబడింది. ఈ కథలో ప్రపంచంలో క్రైస్తవ మతంపై నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నట్టుండి మాయమై స్వర్గానికి వెళ్లిపోతారు. ఈ మూవీ స్టోరీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులోనూ హాలీవుడ్ స్టార్ నటుడు నికోలస్ కేజ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీని ఫ్రీగానే చూడవచ్చు.