OTT Movie : వెబ్ సిరీస్ లను ఇష్టపడేవాళ్ళకి ఓటీటీలో కావలసినంత కంటెంట్ ఉంది. చూపును పక్కకి తిప్పుకోకుండా చేసే సిరీస్ లు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో థ్రిల్లర్ సిరీస్ లను ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఆ తరువాత కామెడీ కంటెంట్ ఉన్న సీరీస్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పువబోయే సిరీస్ కామెడీ జానర్లో వచ్చింది. ఈ స్టోరీ అమెరికాకి వెళ్ళిన ఒక ఇండియన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ మాత్రం కామెడీతో కేక పెట్టిస్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ ప్రధానంగా ప్రదీప్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు భారతదేశంలోని అహ్మదాబాద్ నుండి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు వలస వస్తారు. ప్రదీప్ రాకెట్ విడి భాగాలను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. అతని భార్య సుధ భారతదేశంలో బ్రెయిన్ సర్జన్ గా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో మెడికల్ లైసెన్స్ పొందడంలో అడ్డంకులను ఎదుర్కొంటుంది. వీళ్ళ ముగ్గురు పిల్లలు భాను, కమల్, వినోద్ కొత్త స్కూల్ లో పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తారు. ఇలా ఉంటే ఇక్కడ ప్రదీప్ కుటుంబం యు.ఎస్. ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఏజెంట్లుతో ఇంటరాగేషన్ ఎదుర్కొంటుంది. వీళ్ళ పొరుగువారైన మిల్స్ కుటుంబం ఇంటికి నిప్పు అంటించిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది. అయితే దీనిలో దోషి ఎవరనేది మాత్రం అస్పష్టంగా ఉంటుంది.
మరోవైపు భాను మిల్స్ కుటుంబం కొడుకు స్టూ తో ప్రేమలో పడుతుంది. దీనికి రెండు కుటుంబాలలోని సభ్యులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఇంతలోనే భాను, స్టూ ద్వారా గర్భవతి అవుతుంది. ఇది ప్రదీప్ కుటుంబం అమెరికాలో ఉండటానికి ఒక కారణంగా మారుతుంది. ఇలా ఉంటే ప్రదీప్ తన వ్యాపారంలో రుణం పొందడంలో విఫలమవుతాడు. సుధకి మెడికల్ లైసెన్స్ రావడం కష్టంగా మారుతుంది. ఇవన్నీ వీళ్ళ అమెరికన్ డ్రీమ్‌ను సాధించడంలో అడ్డంకిగా మారుతాయి. చివరికి ప్రదీప్ ఫ్యామిలీ అమెరికాలో ఎలా మనుగడ సాగిస్తుంది ? మిల్స్ ఇంటికి నిప్పు పెట్టింది ఎవరు ? భాను లవ్ కి పేరెంట్స్ ఓకే చెప్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కామెడీ టెలివిజన్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : మెజీషియన్ పేరుతో హత్యలు… ఈ తమిళ మర్డర్ మిస్టరీని అస్సలు మిస్ చేయొద్దు
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ అమెరికన్ కామెడీ టెలివిజన్ సిరీస్ పేరు ‘ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బర్గ్’ (The Pradeeps of Pittsburgh). దీనిని విజల్ పటేల్ రూపొందించారు. దీనిని Amazon MGM స్టూడియోస్, సోనీ పిక్చర్స్ టెలివిజన్ కలసి నిర్మించాయి. ఇందులో సింధు వీ, నవీన్ ఆండ్రూస్, సహనా శ్రీనివాసన్, అర్జున్ శ్రీరామ్, అశ్విన్ శక్తివేల్, నికోలస్ హామిల్టన్, ఈతాన్ సుప్లీ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ భారతదేశం నుండి అమెరికాకు వలస వచ్చిన ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.