OTT Movie : నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి కంటెంట్ ఉన్న స్టోరీలను ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో, ఒకయువకుడు ప్రియురాలితో సహా నాలుగు హత్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటాడు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీలో ఒక యువకుడు తాను ప్రేమించిన యువతితో సహా, నలుగురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. చనిపోయిన యువతి ఒక రాజకీయ నాయకుడి కుమార్తె. అతని తండ్రి ఈ రాజకీయ నాయకుడి దగ్గర డ్రైవర్ గా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే వీళ్ళ ప్రేమకు సామాజికంగా అడ్డంకులు వస్తాయి. కులాలు, అంతస్థులు వేరు కావడంతో పెద్దలు వ్యతిరేకిస్తారు. అయితే ఈ జంట హోటల్‌లో ఒక రాత్రి ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత పెద్దలు పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకుంటారు. కానీ ఇంతలోనే పోలీసుల దాడి కారణంగా తొందరపడి బయటకు పరుగులు పెడతారు. ఈ సందర్భంలో, అమ్మాయి కాలు జారి కిందపడి స్పృహ కోల్పోతుంది.
ఈ యువకుడు ఆమె చనిపోయిందని భావిస్తాడు. ఈ గందరగోళంలో, అతను ఆమె బాడిని దాచడానికి ప్రయత్నిస్తాడు. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల ఇతడు మరో నాలుగు హత్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అతను నేను ఎటువంటి హత్యలు చేయలేదని వాదిస్తాడు. చివరికి ఈ యువకుడు నిజంగానే హత్యలు చేశాడా ? అమ్మాయి స్పృహలోకి వస్తుందా ? ఈ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతురి కళ్ల ముందే తండ్రి దారుణం… ప్రేమించిన అమ్మాయి కోసం ఊహించని పని చేసే హీరో
సోనీ లివ్ (Sony LIV) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బ్లాక్, వైట్ & గ్రే: లవ్ కిల్స్’ (Black white & gray love kills). 2025 లో వచ్చిన ఈ సిరీస్ కు పుష్కర్ సునీల్ మహాబల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి కలిగివుంది. తెలుగుతో సహా ఏడు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ లో ఈ సిరీస్ విడుదలైంది. ఈ సిరీస్ స్టోరీ నాగ్‌పూర్‌లో 2020 లో జరిగిన నాలుగు హత్యల చుట్టూ తిరుగుతుంది.