BigTV English
Advertisement

OTT Movies : నెలలోపే ఓటీటీలోకి నిత్యామీనన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movies : నెలలోపే ఓటీటీలోకి నిత్యామీనన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నిత్యామీనన్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్గా చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈమధ్య తెలుగు ఇండస్ట్రీలో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలో ఏమీ లేవు. తమిళ మూవీస్ లో ఎక్కువగా నటిస్తుంది. ఇక ఇటీవల ఈమె పేరు వార్తల్లో హైలెట్గా నిలిచింది. ఆమెపై ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వెళుతుంది. రచయిమ నటించిన ఓ మూవీ నెలలోపులే ఓటిటిలోకి వచ్చేసింది. మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి నిత్యామీనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ నేరామిల్లై… ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది.. థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీని తమిళం తో పాటు తెలుగు మలయాళం వంటి పలు భాషల్లో స్విమ్మింగ్ కు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీని తమిళ నాడు డిప్యూటీ సీఏం ఉదయనిది స్టాలిన్ నిర్మించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ తదితరులు నటించారు. ఈ మూవీ భారీ అంచనా నడుమ థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే మంచి సక్సెస్ టాక్ నే అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

బాస్ కుమార్తెను ప్రేమించిన వ్యక్తి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ వ్యక్తి..తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయాత్నాలు.. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన స్నేహితుడిని తన తండ్రిగా నటించమని ఒప్పిస్తాడు. ఇది హాస్యాస్పదమైన అపార్థాలకు దారితీస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ.. ఇకపోతే నిత్యామీనన్ అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్‌, జబర్దస్త్‌, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్‌, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇడ్లీ కడాయ్‌, డియర్‌ ఎక్సెస్‌ సహా మరో సినిమా చేస్తోంది.

Tags

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×