OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలను చూస్తుంటారు మూవీ లవర్స్. కొన్ని సినిమాలు చూసినప్పుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీని చూస్తే అలానే అనిపిస్తుంది. దొంగతనాలు మానేసి మంచిగా బతుకుతున్న ఒక వ్యక్తి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో కోర్టులో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (jio hotstar) లో
ఈ మలయాళం కామెడీ మూవీ పేరు ‘న్నా తాన్ కేస్ కోడు’ (Nna Thaan Case Kodu). 2022లో విడుదలైన ఈ మలయాళ కోర్ట్‌రూమ్ కామెడీ మూవీకి రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ దర్శకత్వం వహించగా, సంతోష్ టి. కురువిల్లా నిర్మించారు. ఈ మూవీలో కుంచాకో బోబన్, గాయత్రీ శంకర్ నటించారు. దీనికి డాన్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. రాజీవ్ అనే దొంగ న్యాయం కోసం చేసే పోరాటం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ‘న్నా తాన్ కేస్ కోడు’ 11 ఆగస్టు 2022న థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రాజీవన్ దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. ఒకసారి దొంగతనం చేసి, పోలీసులకు దొరక్కుండా వేరే ఊరికి వెళ్లి పని చేసుకుంటూ ఉంటాడు. అయితే అదే ఊరిలో ఉండే దేవి అనే అమ్మాయిని ఇష్టపడతాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా, లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఆ ఇంట్లో దేవి తండ్రికి సేవలు కూడా చేస్తుంటాడు రాజీవన్. దొంగతనాలు మానేసి దేవితో అలా హ్యాపీగా బతుకుతుంటాడు. ఒక రోజు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఒక వ్యాన్ ను తప్పించుకోబోయి పక్కనే ఉన్న గోడను దూకుతాడు. అది ఒక ఎమ్మెల్యే ఇళ్లు. అక్కడ ఒక కుక్క ఉండటంతో ఇతన్ని బాగా కరుస్తుంది. ఈ విషయంపై రాజీవన్ కోర్టులో కేసు వేస్తాడు. రోడ్డులో గుంత ఉండడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని, మినిస్టర్ ని ఈ కేసులో విచరించాలని కోర్టులో చెప్తాడు. ఆ గుంత వల్ల చెడ్డ పేరు వస్తుందని, రాజీవన్ పై ఎమ్మెల్యే కేసు వేస్తాడు. ఈ కోర్టు డ్రామా చాలా ఫన్నీ గాను, ఆలోచింపజేసే విధంగానే ఉంటుంది. చివరికి రాజీవన్ ఈ కేసులో గెలుస్తాడా? ఎమ్మెల్యే వేసిన కేసు ఏమవుతుంది. మినిస్టర్ ని కూడా కోర్టుకు రప్పిస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘న్నా తాన్ కేస్ కోడు’ (Nna Thaan Case Kodu) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.