BigTV English

 OTT Movie : అందమైన దయ్యాన్ని ఆదుకునే పిల్లోడు… అందానికి మంత్రం వేసే మంత్రగాడు

 OTT Movie : అందమైన దయ్యాన్ని ఆదుకునే పిల్లోడు… అందానికి మంత్రం వేసే మంత్రగాడు

OTT Movie : బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. వీటిని ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా  చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక దయ్యం రాత్రి పూట చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ దయ్యం వెనుక అదిరిపోయే స్టోరీ కూడా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (jio hotstar) లో

ఈ బెంగాలీ హారర్ ఫాంటసీ మూవీ పేరు ‘భూత్పోరి’ (Bhootpori). ఈ మూవీకి సౌకార్య ఘోసల్ దర్శకత్వం వహించారు. ఇందులో జయ అహ్సన్, రిత్విక్ చక్రవర్తి, శాంతిలాల్ ముఖర్జీ, సుదీప్తా చక్రవర్తి నటించారు. దెయ్యాలు స్వర్గంలోకి వెళతారనే నమ్మకంతో, విముక్తి కోసం ఎదురు చూస్తున్న ఒక ఒంటరి దెయ్యం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీని గోవా 2024లో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమ కోసం అధికారికంగా ఎంపిక చేశారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సూర్య తన తల్లిదండ్రులతో కలిసి చదువుకుంటూ ఉంటాడు. ఇతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఒకరోజు నిద్రలో లేచి బిల్డింగ్ పై కూర్చుని ఫ్లూట్ వాయిస్తుంటాడు. తల్లికి అనుమానం వచ్చి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకు వెళుతుంది. కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే, ఈ సమస్య తగ్గుతుందని డాక్టర్ చెప్తాడు. ఈ క్రమంలోని సూర్యని, తల్లి అంజలి తన సొంత ఊరుకు తీసుకు వెళుతుంది. ఆ ప్రాంతంలో వీళ్ళ పూర్వికులు ఉండే ఇల్లు బాగా పాడుబడిపోయి ఉంటుంది. దానిని శుభ్రం చేపించే పనిలో ఉంటుంది అంజలి. సూర్య మాత్రం ఆ ప్రాంతాన్ని చూస్తూ తిరుగుతుంటాడు. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఒక అడవి ఉంటుంది. అడవిలో భాను అనే ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఎవరికీ కనిపించని ఆత్మ సూర్యకి మాత్రం కనబడుతూ ఉంటుంది. ఆత్మను చూసిన సూర్య తనతో మాట్లాడుతాడు. మా ఇంట్లో గోల్డ్ రింగ్స్ పోయాయని, దానిని నువ్వే దొంగలించినావని చెప్తాడు. అది విని అటువంటి పని నేను చేయనని ఆత్మ చెప్తుంది.

 

ఇంకోసారి ఈ అడవి వైపు వస్తే నిన్ను మింగేస్తానని అంటుంది. ఆ తర్వాత ఆత్మకి అతడు ఠాగూర్ వంశిస్తుడని తెలుస్తుంది. నిజానికి ఠాగూర్ ఆ ఊరిలో ఒక మంత్రగాడు. భాను భర్త చనిపోవడంతో మరో పెళ్లి చేయమంటాడు మంత్రగాడు. ఆమె తండ్రి అందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే ఒకరోజు అనుకోకుండా భానుని దారుణంగా చంపేస్తారు. వెనకనుంచి గట్టిగా కొట్టడంతో వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేక పోతుంది భాను. ఆమె చావును చూసి తండ్రి కూడా చచ్చిపోతాడు. ఈమె విషాద కథను తెలుసుకున్న సూర్య ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. చివరికి భానుని చంపింది ఎవరు? సూర్య ఆ దయ్యానికి సాయం చేస్తాడా? ఠాగూర్ పాత్ర ఇందులో ఎంత ఉంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×