E-Paper
Advertisement

హ్యుందాయ్ నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

హ్యుందాయ్ నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!
Advertisement

Upcoming Hyundai SUVs in India: భారత కార్ల మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా మరిన్ని ప్లాన్స్ తో ముందుకు వెళ్తోంది. భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు 2030 నాటికి పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తో పాటు ఎలక్ట్రిక్ కార్లను కలిపి మొత్తం 26 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2027లో రెండు కొత్త SUVలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకటి చిన్న ఎలక్ట్రిక్ SUV కాగా, మరొకటి న్యూ జెనరేషన్ క్రెటా హైబ్రిడ్ మోడల్.

హ్యుందాయ్ ఐయోనిక్ పి.. చిన్న ఎలక్ట్రిక్ SUV..

హ్యుందాయ్ తీసుకురానున్న కొత్త ఎలక్ట్రిక్ SUV ఐయోనిక్ పి (Ioniq P). నాలుగు మీటర్ల లోపు పొడవుతో రానున్న ఈ కారు స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ SUVను సంస్థకు చెందిన E-GMP (K) ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫామ్‌పై తయారు చేస్తున్నారు. అయితే, బ్యాటరీ కెపాసిటీ, సింగిల్ ఛార్జ్ తో వచ్చే రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలను హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు.

Advertisement

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కొత్త ప్లియోస్ కనెక్ట్ (Pleos Connect) సాఫ్ట్‌ వేర్ ఉండనున్నాయి. ఈ టెక్నాలజీని పొందే ఫస్ట్ ఇండియన్ హ్యుందాయ్ మోడల్ ఇదే కానుంది. అంతేకాకుండా, లెవల్-2 ADAS లాంటి అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

హైబ్రిడ్ టెక్నాలజీతోన్యూజెనరేషన్ హ్యుందాయ్ క్రెటా..

దేశంలో బెస్ట్ SUVలలో ఒకటైన క్రెటా త్వరలో కొత్త అప్ డేట్స్ తో రానుంది. థర్డ్ జెనరేషన్ క్రెటాలో డిజైన్, పరిమాణాలు, టెక్నాలజీ పరంగా కీలక మార్పులు ఉండనున్నాయి. ఇందులో అత్యంత ప్రత్యేకమైనది హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా రూపొందించిన హైబ్రిడ్ సిస్టమ్‌ ను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కూడా కంటిన్యూ కానున్నాయి. కొత్త క్రెటా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పొడవు, వెడల్పు, ఎత్తులో పెరగనుంది. వీల్‌ బేస్ కూడా ఎక్కువగా ఉండటంతో క్యాబిన్‌ లో ప్రయాణికులకు మరింత ప్లేస్ లభించనుంది.

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గ్లియో AI అసిస్ట్, OTA అప్‌ డేట్స్, కొత్త స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ ఇంటీరియర్ లాంటి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.

ఆటో ఎక్స్‌ పోలో ప్రదర్శించే అవకాశం..

ఈ రెండు కొత్త SUVలను 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో హ్యుందాయ్ ప్రదర్శించే అవకాశం ఉంది. అప్పుడు పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read Also: థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

Tags

Related News

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

Big Stories

Advertisement
×