Kannada Crime Suspense Thriller: కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది పురుషులు… వాళ్లను ఊచకోత కోసే ఓ మహిళ… ఆమె చేతిలో చట్టం కాదు, చావు ఉంటుంది. కామాంధులు అంతా ఒకరి తర్వాత మరొకరు టార్గెట్ అవుతున్న వేళ అసలు ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారు ? ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ? ఆ ప్రతీకారం వెనుక దాగి ఉన్న గతం ఏంటి ? ఈ అంశాల చుట్టూ సాగే కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మృత్యుదేవత’ (Mruthyudevate). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?
సమాజంలో మహిళలపై దారుణంగా ప్రవర్తించే కొంతమంది పురుషులతో కథ మొదలవుతుంది. వాళ్లు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడకపోయినా… ఓ మహిళ మాత్రం వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టాలని అనుకోదు. తనకు ఎదురైన అనుభవాలు, చుట్టూ జరుగుతున్న అన్యాయాలు ఆమె ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి. తప్పు చేసిన వాళ్లను వాళ్ల దారిలోనే ఎదుర్కోవాలనే నిర్ణయానికి వస్తుంది. అక్కడి నుంచి ఒక్కో హత్య జరుగుతుంటుంది. మొదట అవన్నీ వేర్వేరు ఘటనల్లా కనిపిస్తాయి. కానీ వాటి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం మొదలవుతుంది. టార్గెట్ అవుతున్న వ్యక్తుల గతాన్ని పరిశీలిస్తే వాళ్లు చేసిన తప్పులు బయటపడతాయి.
అదే సమయంలో ఈ శిక్షలు ఎవరు విధిస్తున్నారు, ఎందుకు ఇంత పకడ్బందీగా జరుగుతున్నాయనే విషయం మాత్రం పోలీసులకు అంతుచిక్కదు. ఆమెను ఆపడానికి ప్రయత్నించే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఆమె వెనక్కి తగ్గదు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదనే నిర్ణయంతో ముందుకు వెళ్తుంది. ఆమె చేస్తున్నది నిజంగా న్యాయమేనా ? లేక గతంలో జరిగిన ఏదైనా ఘటనకు ఇది ప్రతీకారమా ? అనే కోణాల్లో పోలీసుల విచారణ సాగుతుంది. ఒకరి తర్వాత ఒకరు టార్గెట్ అవుతున్న తీరు వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టే ప్రయత్నం మొదలవుతుంది. మరోవైపు ఆమె ప్రయాణం కూడా మరింత ప్రమాదకరంగా మారుతుంది. చివరికి ఆమెను ‘మృత్యుదేవత’గా మార్చిన పరిస్థితులు ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
ప్రస్తుతం ‘మృత్యుదేవత’ ప్రైమ్ వీడియో (Prime Video)లో రెంట్ కి స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. వినయ ప్రసాద్, సారిక రావు, డయానా జెస్సికా, మహిన్ కుబేర్, హిమా మోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు నవీన్ మహదేవ్ ఈ (Naveen Mahadev E) దర్శకత్వం వహించారు. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. కావలసినంత సస్పెన్స్ తో పాటు మిస్టరీ సినిమాను ఉత్కంఠభరితంగా మారుస్తుంది. మీరు గనుక థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమాను డోంట్ మిస్. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా అందుబాటులో లేదు. పైగా ప్రస్తుతం రెంట్ బేసిస్ లో ఉండడం గమనార్హం.
Read Also: అమ్మాయిని 6 దాటితే కలవకూడదనే వింత కండిషన్.. రూపం మార్చే ఈవిల్ మిస్టరీ