E-Paper
Advertisement

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!
Advertisement

iQOO Z11: మార్కెట్‌లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా.. ఐకూ ఇచ్చే ఆ క్రేజ్ వేరు. ఇప్పుడు ‘ఐకూ Z11’ రూపంలో మరొక సూపర్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి రాబోతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఫోన్‌ను.. మన దేశంలోని ఐకూ అభిమానుల కోసం మరింత స్టైలిష్‌గా రీ-డిజైన్ చేశారు. ఆ కొత్త లుక్ ముచ్చట్లేంటో ఇప్పుడు చూసేద్దాం!

కొత్త డిజైన్, ఆకట్టుకునే లుక్:

ఐకూ ఇండియా సీఈఓ నిపున్ మార్యా ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చైనా మోడల్‌తో పోలిస్తే ఇండియన్ వేరియంట్ వెనుక వైపు డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంది. దీని వెనుక భాగంలో పిల్ షేప్‌లో ఉన్న ‘స్కైలైన్ కెమెరా మాడ్యూల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిలో రెండు పెద్ద కెమెరా రింగ్స్, ఒక సెన్సార్‌తో పాటు ఒక ఎల్ఈడీ లైట్ రింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

Also Read: యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

కలర్ ఆప్షన్లు, ఫీచర్లు:

iQOO Z11 స్మార్ట్‌ఫోన్ అరోరా గ్రీన్, సెలెస్టియల్ బ్లూ అనే రెండు క్రేజీ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే చేతిలో పట్టుకోవడానికి వీలుగా 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, సన్నని ఫ్రేమ్‌తో పాటు వెనుక వైపు కర్వ్‌డ్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు పైభాగంలో స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉండగా.. కుడివైపు వాల్యూమ్, పవర్ బటన్లు ఇచ్చారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను వాడనున్నట్లు సమాచారం.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ.. ఈ నెలలోనే భారత మార్కెట్లోకి iQOO Z11 వస్తుందని అంచనా వేస్తున్నారు. చైనాలో దీని బేస్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ.31,200 నుండి ప్రారంభమైంది. మన దేశంలో కూడా దాదాపు ఇదే బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరా, డిజైన్ పరంగా కొత్తదనం కోరుకునే వారికి ఐకూ Z11 మంచి ఆప్షన్ కానుంది.

Also Read: Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×