Supernatural Romantic Mystery Series: సమస్యలు ఉన్నా ఎవరూ ముందుకు రాకపోతే… వాళ్ల దగ్గరకే వెళ్లే ఓ సీక్రెట్ క్లబ్. డబ్బు కోసం ప్రమాదకరమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉండే ఎనిమిది మంది అంటే నాలుగు జంటలు… కానీ ఓ డేంజరస్ మిషన్ మొదలైన తర్వాత వాళ్ల మధ్య ఏర్పడే బంధాలు మాత్రం ఊహించలేరు. అతీంద్రియ శక్తులు, ప్రమాదకరమైన పనులు, ప్రేమ మధ్య సాగే థాయ్ సిరీస్ ‘ది క్రో క్లబ్’ (The Crow Club). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే ?
సమాజంలో ఎక్కడా తమకు చోటు దొరకని కొంతమంది వ్యక్తులు కలిసి ఓ రహస్య క్లబ్ ను ఏర్పాటు చేసుకుంటారు. వాళ్లకు వచ్చే పనులు కూడా సాదాసీదావి కావు. ఇతరులు చేయడానికి భయపడే విచిత్రమైన కేసులు, అతీంద్రియ ఘటనలు, ప్రమాదకరమైన మిషన్లు… డబ్బు కోసం వీళ్లు వాటిని స్వీకరిస్తుంటారు. ఈ క్లబ్ లో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వాళ్లు నాలుగు జంటలుగా కథలో కనిపిస్తారు. మొదట వాళ్లందరికీ ఒకటే లక్ష్యం ఉంటుంది. పని పూర్తి చేయాలి, డబ్బు తీసుకోవాలి. కానీ ఒక్కో మిషన్ లోకి వెళ్లేకొద్దీ వాళ్ల మధ్య వ్యక్తిగత అనుబంధాలు పెరుగుతాయి.
వాన్ , రక్కున్ కథ కూడా ఇలాగే మొదలవుతుంది. రక్కున్ ను వెంటాడుతున్న ఓ సమస్యను పరిష్కరించడానికి వాన్ రంగంలోకి దిగుతాడు. పరిస్థితుల కారణంగా అతని బాయ్‌ఫ్రెండ్ లా నటించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మొదట ఇది పని కోసం వేసే ఓ నాటకంలా ఉంటుంది. కానీ ప్రమాదం పెరిగే కొద్దీ ఆ నాటకం వెనుక ఉన్న భావాలు కూడా మారిపోతాయి. మిగతా జంటల జీవితాల్లోనూ ఇలాంటి మిషన్లే కొత్త సమస్యలను తీసుకొస్తాయి.
ఒకరిని గతం వెంటాడుతుంది, మరొకరికి అతీంద్రియ శక్తులతో సమస్య వస్తుంది. మరోవైపు క్లబ్ లోని సభ్యుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయి. పని కోసం కలిసి వచ్చిన వాళ్లు క్రమంగా ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు ప్రాణాలకు ప్రమాదం… మరోవైపు తమలో పుట్టే ప్రేమ. ఈ రెండింటి మధ్య ఈ జంటలు తీసుకునే నిర్ణయాలే కథలో ఆసక్తికరంగా ఉంటాయి. మరి సీక్రెట్ క్లబ్ వెనుక ఉన్న ప్రపంచం ఏంటి ? వాళ్లు చేసే మిషన్లు ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నదే సూపర్‌నేచురల్ రొమాంటిక్ మిస్టరీ సిరీస్ స్టోరీ.
‘ది క్రో క్లబ్’ మొదటి సీజన్‌లో మొత్తం 16 ఎపిసోడ్లు ఉన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ విడుదలయ్యే విధంగా షెడ్యూల్ చేశారు మేకర్స్. థాయ్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ తదితర సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం లేదు.
Read Also: హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్