E-Paper
Advertisement

అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో

అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో
Advertisement

Horror Mystery Thriller: హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ఆడియన్స్‌ కోసం ఓటీటీలోకి ఒక అదిరిపోయే సినిమా వచ్చేసింది. ఈ చలికాలంలోనూ ఒంటికి చెమటలు పట్టించేలా, భయంకరమైన వాతావరణంతో సాగే ఆ మిస్టరీ హారర్ మూవీ పేరే ‘హోకమ్’ (Hokum). ఓ పాత హోటల్‌లోని హనీమూన్ గదికి సంబంధించిన మంత్రగత్తె కథ, అక్కడ చోటుచేసుకునే వింత సంఘటనల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మరి హారర్ మూవీ లవర్స్ ఈ సినిమాను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఓమ్ బామన్ ప్రముఖ హారర్ నవలా రచయిత. తన తల్లిదండ్రుల అస్తికలను చల్లడానికి ఐర్లాండ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న పాత హోటల్‌కు వెళ్తాడు. ఆ హోటల్‌ కు అతని తల్లిదండ్రుల జీవితంతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్లు హనీమూన్ గడిపిన ప్రదేశం అదే. అయితే, ఆ హోటల్‌లోని హనీమూన్ సూట్ గురించి అక్కడి సిబ్బంది చెప్పే కథలు మాత్రం ఓమ్‌కు ఆసక్తిని కలిగిస్తాయి. ఆ గదిలో ఓ మంత్రగత్తె ఉంటుందని, అందుకే దాన్ని చాలా కాలంగా మూసి ఉంచారని చెబుతారు.

Advertisement

మొదట ఈ విషయాలను ఓమ్ పెద్దగా పట్టించుకోడు. కానీ హోటల్‌లో ఉంటున్న సమయంలో అతనికి కొన్ని వింత సంఘటనలు జరిగినట్టు అన్పిస్తుంది. ఇదే సమయంలో హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తి అనూహ్యంగా కనిపించకుండా పోతాడు. అతని అదృశ్యంతో పరిస్థితులు మరింత భయంకరంగా మారతాయి. ఓమ్‌కు కనిపించే వింత దృశ్యాలు, హోటల్‌లో చోటుచేసుకునే సంఘటనలు అతని గతంలోని జ్ఞాపకాలను కూడా బయటకు తీసుకొస్తాయి.

దీంతో అతను కేవలం ఓ మంత్రగత్తె కథను తెలుసుకోవడమే కాకుండా, తనను వెంటాడుతున్న గతాన్ని కూడా బయట పెట్టాల్సి వస్తుంది. అసలు ఆ హనీమూన్ సూట్‌లో ఏం జరుగుతోంది ? మాయమైన హోటల్ ఉద్యోగి ఏమయ్యాడు ? అక్కడి మంత్రగత్తె కథ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? ఓమ్ తన గతంతో పాటు ఆ హోటల్‌లోని భయంకరమైన నిజాలను ఎలా ఎదుర్కొన్నాడు ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవలసిన అంశం.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘హోకమ్’ 2026లో విడుదలైన ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో A సర్టిఫికేషన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఈ హారర్ మిస్టరీని చూడొచ్చు. ప్రముఖ హారర్ దర్శకుడు డామియన్ మెక్‌కార్తీ (Damian McCarthy) తెరకెక్కించిన ఈ హాలీవుడ్ చిత్రంలో ఆడమ్ స్కాట్ (Adam Scott), డేవిడ్ విల్మట్ (David Wilmot), పీటర్ కూనన్ (Peter Coonan), ఫ్లోరెన్స్ ఓర్డేష్ (Florence Ordesh) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read Also: గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

Related News

ఖైదీల వరుస మర్డర్స్… కనిపించని దెయ్యాన్ని పట్టుకోవడానికి తంటాలు… జైలు అంటేనే జడిపించే హారర్

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓవైపు… వెంటాడుతున్న కరడుగట్టిన క్రిమినల్ మరోవైపు… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

5 కోట్లు మాయం… రెండేళ్ల క్రితమే కన్నుమూసిన డైరెక్టర్ చివరి సినిమా… ప్రియమణి కొత్త క్రైమ్ థ్రిల్లర్ ని ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

Big Stories

Advertisement
×