Psychological Horror Thriller: ప్రేమించిన అబ్బాయితో కలిసి ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. బాయ్ ఫ్రెండ్ తో కలిసి వీకెండ్ లో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్లాలని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన లోకేషన్ లో ఒంటరిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. కానీ అలా వెళ్లిన ఒక యువతికి అక్కడ ఎదురైన ఊహించని ట్విస్ట్ చూస్తే ఎవరికైనా గుండె జారిపోవాల్సిందే. అలాంటి షాకింగ్ అండ్ మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరే ‘కీపర్’ (Keeper). లవ్, మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా అమ్మాయిలకు ఒక బిగ్గెస్ట్ ఐ-ఓపెనర్ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ హారర్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
లిజ్, మాల్కమ్ అనే జంట తమ మొదటి యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీకి దూరంగా వెళతారు. అక్కడ ఉన్న ఓ మారుమూల క్యాబిన్ వీళ్ళ డెస్టినేషన్. మొదట్లో ఆ ప్రదేశం చాలా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి కొంత సమయం గడిపాక, మాల్కమ్ బంధువు డారెన్, అతని గర్ల్‌ఫ్రెండ్ మింకా అక్కడికి వస్తారు. వారి రాకతో లిజ్‌కు కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మాల్కమ్ ఓ పని మీద తిరిగి సిటీకి వెళ్లాల్సి వస్తుంది. లిజ్ మాత్రం క్యాబిన్ లో ఒంటరిగా ఉండిపోతుంది.
అప్పటి నుంచి అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. ఎవరో అరుస్తున్నట్లు వినిపించడం, రక్తంతో తడిసిన మహిళల రూపాలు కనిపించడం, తనను పోలిన గర్భిణి స్త్రీ కలల్లోకి రావడం… ఇలా లిజ్‌కు భయంకరమైన సీన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు మింకా కూడా అడవిలో ఓ కనిపించని శక్తి దాడికి గురవుతుంది. క్యాబిన్‌లో ఏదో ప్రమాదం పొంచి ఉందని లిజ్‌కు అర్థమవుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా పరిస్థితులు ఆమెకు అనుకూలించవు.
మాల్కమ్ తిరిగి వచ్చిన తర్వాత అతని ప్రవర్తనపై లిజ్‌కు అనుమానాలు మొదలవుతాయి. క్యాబిన్‌లో కనిపించిన ఓ పాత ఫొటోతో అసలు నిజం బయట పడుతుంది. చివరకు మాల్కమ్ చెప్పిన నిజం వింటే లిజ్‌కే కాదు, ప్రేక్షకులకు కూడా షాక్ తప్పదు. మరి ఆ నిజం ఏంటి ? ఆ వింత జీవుల నుంచి లిజ్ తప్పించుకోగలిగిందా ? తనను ప్రేమిస్తున్నానని చెప్పిన మాల్కమ్ నిజ స్వరూపం ఏంటి ? చివరకు లిజ్ అతనికి ఎలాంటి సమాధానం ఇచ్చింది ? అన్నది సినిమాలోని అసలు ట్విస్ట్. ఈ కథలో క్లైమాక్స్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది.
‘కీపర్’ 2025లో విడుదలైన ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్. ఓస్‌గుడ్ పెర్కిన్స్ (Osgood Perkins) దర్శకత్వం వహించారు. టటియానా మస్లానీ (Tatiana Maslany), రాసిఫ్ సదర్లాండ్ (Rossif Sutherland) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు ఆడియోతోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోలతో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్