E-Paper
Advertisement

క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా

క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా
Advertisement

Christmas Family Drama: శీతాకాలం వచ్చేసింది, నవంబర్ – డిసెంబర్ నెలలు అంటేనే క్రిస్మస్ వైబ్స్ షురూ అవుతాయి. ఈ హాలిడే సీజన్‌లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని హ్యాపీగా, కాస్త ఎమోషనల్‌గా చూసే ఒక వండర్‌ఫుల్ ఫ్యామిలీ డ్రామా మూవీ ‘ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్’ (A Dog’s Perfect Christmas). పెట్స్ ని, ముఖ్యంగా కుక్కలను ప్రాణంగా ప్రేమించే డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే, ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు భయ్యా. ఈ అందమైన హార్ట్ టచింగ్ హాలిడే మూవీ తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

శాండర్ గాస్ తన భార్యను కోల్పోయిన తర్వాత ఒంటరితనంతో బాధ పడుతుంటాడు. అతనితో పాటు ఉంటున్న టీనేజ్ మనవరాలు ఎల్లోతో కూడా తరచూ అభిప్రాయభేదాలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల కెరీర్ టెన్షన్స్, బిజినెస్ లాస్ లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఫ్యామిలీ దాదాపు కుప్పకూలే పరిస్థితికి వచ్చేస్తుంది. పండుగ రోజున అందరూ సంతోషంగా ఉండాల్సింది పోయి, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా విడిపోయే స్టేజ్‌కి వెళ్తారు. క్రిస్మస్ పండుగ దగ్గరపడుతున్నా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కనిపించదు. ఒకప్పుడు అందరూ కలిసి గడిపిన రోజులు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి సమయంలో ఎల్లో తల్లి జూలియానా కోమాలోకి వెళ్ళిపోతుంది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలవుతుంది. తల్లి ఎప్పుడు కోలుకుంటుందో తెలియని పరిస్థితి, ఇంట్లో ఇప్పటికే ఉన్న మనస్పర్థలు కలిసి అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తాయి.

Advertisement

ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎల్లో, ఆమె తాత శాండర్‌పై పడుతుంది. అదే సమయంలో రూబీ అనే చురుకైన కార్గీ కుక్కపిల్ల కూడా కుటుంబంలోకి వస్తుంది. ఆ చిన్న కుక్కపిల్ల రాకతో ఇంట్లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. విన్‌స్టెడ్‌, రూబీ చేసే పనులు కుటుంబ సభ్యులను దగ్గర చేస్తాయి. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూనే, క్రిస్మస్‌ను కుటుంబమంతా కలిసి జరుపుకోవాలని ఎల్లో, శాండర్ ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయా ? తమకు ఎదురైన కష్టాన్ని అధిగమించి మళ్లీ సంతోషంగా ఉండగలుగుతారా ? కుటుంబాన్ని కలిపి ఉంచడంలో విన్‌స్టెడ్‌, రూబీ పాత్ర ఏంటి ? అన్నదే ఈ కథలో చూడాల్సిన ఎమోషనల్ పాయింట్.

ఏ ఓటీటీలో చూడొచ్చు ?

‘ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్’ నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదల కానుంది. ఈ సినిమా ఒరిజినల్ ఇంగ్లీష్ భాషలో రూపొందింది. కుటుంబంతో కలిసి చూడదగ్గ హాలిడే డ్రామాలు, పెంపుడు కుక్కలతో ముడిపడిన భావోద్వేగ కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. క్రిస్మస్ సీజన్‌లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఓ మంచి ఎమోషనల్ సినిమా ఇది. ముఖ్యంగా పెంపుడు జంతువులను ప్రేమించేవారికి మనసుకు హత్తుకునే కథ. ఈ అందమైన ఫ్యామిలీ డ్రామాను ప్రముఖ రచయిత డబ్ల్యూ. బ్రూస్ కామెరాన్ (W. Bruce Cameron) రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. డెన్నిస్ క్వాయిడ్ (Dennis Quaid), మిలో వెంటిమిగ్లియా (Milo Ventimiglia), బ్రూక్ లీనా జాన్సన్ (Brooke Lena Johnson), మేరీ స్టీన్‌బర్గెన్ (Mary Steenburgen) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Read Also: తండ్రి నమ్మకం… కూతురి పట్టుదల… ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా

Tags

Related News

సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ

కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా

గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పండగే.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినవి సినిమాలు..!

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

Big Stories

Advertisement
×