E-Paper
Advertisement

చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్‌… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?

చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్‌… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?
Advertisement

Animated Fantasy Movie: మంచి కథ, భావోద్వేగం ఉండే యానిమేషన్ సినిమాలను చూస్తే వచ్చే కిక్కే వేరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఇలాంటి సినిమాలను ఎవరు ఇష్టపడరు చెప్పండి. ముఖ్యంగా జంతువుల చుట్టూ తిరిగే కథలు మనసుకు మరింత దగ్గరవుతాయి. అలాంటి ఓ అద్భుతమైన యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ‘ఆల్ డాగ్స్ గో టు హెవెన్’ (All Dogs Go to Heaven). చనిపోయిన ఓ కుక్క తిరిగి భూమిపైకి వచ్చి తన శత్రువుపై పగ తీర్చుకోవాలని ప్రయత్నించడం, ఆ ప్రయాణంలో ప్రేమకు అసలైన అర్థం తెలుసుకోవడం ఈ సినిమా స్పెషాలిటీ.

కథలోకి వెళ్తే… 

చార్లీ బి. బార్కిన్ అనే కుక్క తన వ్యాపార భాగస్వామి కార్‌ఫేస్ తో కలిసి ఓ క్యాసినోను నడుపుతుంటుంది. అయితే, వ్యాపారంలో లాభాలను పంచుకోవడం ఇష్టం లేని కార్‌ఫేస్, చార్లీని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. అతని మనుషులు చార్లీని కారుతో తొక్కించి చంపేస్తారు. అలా చనిపోయిన చార్లీ నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది. అక్కడ ఓ దేవదూత కుక్క దానికి ఓ ప్రత్యేకమైన పాకెట్ వాచ్ చూపిస్తుంది. ఆ వాచ్ చార్లీ జీవితానికి ప్రతీక. అది నడుస్తున్నంత కాలం చార్లీ బతికి ఉంటుందని చెబుతుంది.

Advertisement

కానీ, చార్లీకి స్వర్గంలో ఉండటం నచ్చదు. తనను మోసం చేసి చంపిన కార్‌ఫేస్‌పై పగ తీర్చుకోవాలనే కోరికతో తిరిగి భూమిపైకి రావాలని నిర్ణయించుకుంటుంది. స్వర్గంలోకి మళ్లీ ప్రవేశించే అవకాశం కోల్పోతావని హెచ్చరించినా వినకుండా, ఆ వాచ్‌ను వెనక్కి తిప్పి భూమిపైకి వచ్చేస్తుంది. అక్కడ తన పాత స్నేహితుడు ఇచీని కలుసుకుని, కార్‌ఫేస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది.

ఈ క్రమంలో కార్‌ఫేస్ ఓ అనాథ బాలిక ఆన్-మేరీని తన క్యాసినో కోసం ఉపయోగించుకుంటున్నాడని చార్లీకి తెలుస్తుంది. జంతువులతో మాట్లాడగలిగే ప్రత్యేక శక్తి ఉన్న ఆ చిన్నారి, ఏ గుర్రం లేదా జంతువు గెలుస్తుందో ముందే చెప్పగలదు. దీంతో కార్‌ఫేస్ ఆమెను తన లాభాల కోసం వాడుకుంటుంటాడు. చార్లీ కూడా మొదట తన ప్రతీకార ప్లాన్ కోసం ఆన్-మేరీని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ చిన్నారితో గడిపే క్రమంలో ఆమెపై ప్రేమ పెరుగుతుంది.

Advertisement

ఒకవైపు కార్‌ఫేస్‌పై పగ, మరోవైపు ఆన్-మేరీతో పెరుగుతున్న అనుబంధం… ఈ రెండింటి మధ్య చార్లీ మనసు మారుతుంది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదం ఎదురైనప్పుడు, తనను తాను కాపాడుకోవడం కంటే ఆమెను రక్షించడమే ముఖ్యమని నిర్ణయించుకుంటుంది. ఆ క్రమంలో తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. పగతో భూమిపైకి వచ్చిన చార్లీ చివరకు ఏం చేశాడు ? పగను ఎలా తీర్చుకున్నాడు ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘ఆల్ డాగ్స్ గో టు హెవెన్’ 1989లో విడుదలైన ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇంగ్షీషులో ఉంది. 1989లో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రానికి డాన్ బ్లూత్ (Don Bluth) దర్శకత్వం వహించారు. బర్ట్ రేనాల్డ్స్ (Burt Reynolds), డోమ్ డెలూయిస్ (Dom DeLuise), విక్టైబ్యాక్ (Vic Tayback), జుడిత్ బార్సీ (Judith Barsi) తదితరులు తమ గొంతులతో పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చేలా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలతో కలిసి ఈ వీకెండ్ ఈ సినిమాపై ఒక లుక్కేయడం మరచిపోవద్దు.

Read Also: స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

Related News

అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో

కొడుకుకు నచ్చిన బొమ్మను కొనివ్వడానికి సిటీని పీకి పందిరేసే తండ్రి… ఎపిక్ ఎమోషనల్ మూవీ

క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా

సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ

కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా

గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

Big Stories

Advertisement
×