BigTV English

Best Web Series: ఆటలు ఆడండ్రా అని పంపిస్తే.. వీరు ఆడే ఆటలేంటో తెలుసా? ఈ సీరిస్‌ను పిల్లలతో చూడొద్దు

Best Web Series: ఆటలు ఆడండ్రా అని పంపిస్తే.. వీరు ఆడే ఆటలేంటో తెలుసా? ఈ సీరిస్‌ను పిల్లలతో చూడొద్దు

OTT Best Web Series: కొన్ని వెబ్ సీరిస్‌లు ఒక్కసారి చూస్తే.. బుర్రలో నుంచి బయటకు పోవు. ముఖ్యంగా స్పానిష్ వెబ్ సీరిస్‌ల కంటెంట్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. వారు చెప్పాలని అనుకొనే విషయాలను మొహమాటం లేకుండా స్క్రీన్ మీదే చూపించేస్తారు. తాజాగా విడుదలైన స్పానిష్ స్పోర్ట్స్ డ్రామా సీరిస్ ‘ఒలింపో’ కూడా ఆ టైపే. టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సీరిస్ రూపొందించారు. అయితే, ఇది పిల్లలతో చూసే సీరిస్ కాదు. పెద్దలు మాత్రమే చూడాల్సిన సీరిస్.


సంపన్నులకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే అథ్లెటిక్ సెంటర్‌లోని క్రీడాకారుల జీవితాలు, పోటీలు, డోపింగ్ కుంభకోణాలు.. వ్యక్తిగత సమస్యలు.. ప్రతి కోణాన్ని ఈ వెబ్ సీరిస్‌లో చూడవచ్చు. స్నేహం, ఈర్ష్యా, ప్రేమ, కోరికలు, బంధాలు.. ఇలాంటి భావోద్వేగాలతో ఈ సీరిస్ సాగుతుంది.

కథ ఏమిటంటే?


ఈ స్టోరీ అమయా (క్లారా గల్లె), తన బెస్ట్ ఫ్రెండ్, తోటి అథ్లెట్ నూరియా (మరియా రొమానిల్లోస్) చూట్టూ తిరుగుతుంది. జోయ్ (నిరా ఒసాహియా), రోక్ (అగస్టిన్ డెల్లా కోర్టె), క్రిస్టియన్ (నూనో గల్లెగో), ఫాతిమా (నజ్వా ఖ్లివా) ఈ కథలో కనిపించే మరికొన్ని కీలక పాత్రలు. జోయ్ ఒక హెప్టాథ్లాన్ అథ్లెట్. నూరియాకు మంచి ఫ్రెండ్. ఆమెకు హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (HPC)లో చేరేందుకు అవకాశం వస్తుంది. నూరియా కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి HPCలో చేరుతుంది. అమయాకు జో‌య్‌ను పరిచయం చేస్తుంది. ఆమె చేరిన కొద్ది రోజులకే ఒలింపో స్పాన్సర్‌లు అక్కడికి వస్తారు. దీంతో క్రీడాకారులంతా ఒత్తిడికి గురవ్వుతారు. నూరియా, అమయా స్విమ్మింగ్ డ్యాన్స్ పార్టనర్స్. కానీ, ఇద్దరికి ఒక గొడవ జరుగుతుంది. దీంతో అమయాకు కోపం వచ్చి నూరియా స్థానంలో మరొకరిని తీసుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరూ అమయాతో సరితూగలేరు. ఒక రోజు అమయా కోపంతో నూరియాకు టాస్క్ ఇస్తుంది. నీటిలో తలకిందులుగా ఊపిరి పీల్చకుండా డ్యాన్స్ చెయ్యాలి. నూరియా ఆ టాస్క్ పూర్తి చేస్తుంది. కానీ, స్ట్రోక్‌కు గురవ్వుతుంది. ఆ తర్వాత ఆస్పత్రిపాలవుతుంది.

నూరియా డ్రగ్స్ తీసుకుంటుందా?

నూరియా ఎవరూ చేయలేని టాస్క్‌ను పూర్తి చేస్తుంది. దీంతో అమయాకు అనుమానం వస్తుంది. ఆమెకు ఎవరైనా డ్రగ్స్ ఇస్తున్నారా అని తెలుసుకుంటుంది. మరోవైపు రగ్బీ ప్లేయర్ రోక్ తన స్నేహితుడు డియెగోతో ఏకాంత క్షణాలు గడుపుతున్న ఫోటో లీక్ అవుతుంది. దీంతో అతడు హోమో అని అందరికీ తెలిసిపోతుంది. రగ్బీ టీమ్ నుంచి కెప్టెన్‌గా డిమోట్ చేస్తారు. జోయ్ జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి HPCలో ఉండాల్సి వచ్చిందనే సీక్రెట్‌ను రెనాటాకు చెబుతుంది. అమయా ఒక అథ్లెట్ డోపింగ్ చేయడం చూస్తుంది. కానీ ఆ విషయాన్ని కంప్లైంట్ చెయ్యదు. ఒక పార్టీలో జోయ్, అమయా మధ్య ఘర్షణ తలెత్తుతుంది.

యాంటీ డోపింగ్ ఏజెన్సీకి కంప్లైంట్

అమయా డోపింగ్ అనుమానంతో యాంటీ-డోపింగ్ ఏజెన్సీకి రిపోర్ట్ చేస్తుంది. టెస్టింగ్‌లో జెన్నిఫర్ అనే అథ్లెట్‌కు పాజిటివ్ వస్తుంది. దీంతో ఆమెను తొలగిస్తారు. అయితే, అమయా తన మాజీ ప్రియుడు క్రిస్టియన్‌పై అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ అతడు నెగెటివ్ రిజల్ట్ సాధిస్తాడు. కానీ మయా లాకర్‌లో డ్రగ్స్ దొరుకుతాయి. దీంతో ఆమె డిస్‌క్వాలిఫై అవుతుంది. కావాలనే ఎవరో తనపై కుట్రకు పాల్పడుతున్నారని అమయా తెలుసుకుంటుంది. మరోవైపు HPC డైరెక్టర్ ఇసాబెల్ అరెస్ట్ అవుతుంది. కొత్త డైరెక్టర్‌గా జానా బాధ్యతలు తీసుకుంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తుంది. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ సీరిస్‌లోని ప్రతి ఎపిసోడ్‌లో పెద్దల సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా హోమో, లెస్పియన్ సీన్స్ ఎక్కువ. కాబట్టి.. ఒంటరిగా చూడండి. ప్రస్తుతం ఈ వెబ్ సీరిస్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగులో లేదు. హిందీలో ఉంది.

Related News

OTT Movie : ఎంపీకి ఎర… లావుగా ఉన్న అమ్మాయిలే టార్గెట్… ట్విస్టులే ట్విస్టులు… ఈ హీస్ట్ థ్రిల్లర్ తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంట్రా ? అబ్బాయి అని కూడా చూడకుండా ఆ పాడు పని… పెద్దలకు మాత్రమే

OTT Movie : ప్రియురాలితో ఉండగానే పరలోకానికి… IMDbలో 7.4 రేటింగ్‌… మలయాళ మిస్టరీ థ్రిల్లర్

The Ba*dsOf Bollywood : కౌంట్ డౌన్ బిగిన్స్.. ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రివ్యూ రిలీజ్.. ఎప్పుడంటే!

HHVM OTT: ఓటీటీలోకి వీరమల్లు.. క్లైమాక్స్‌లో మార్పులు… ఉన్న ఆ ఒక్క సంతృప్తి కూడా పోయింది

Big Stories

×