OTT Movie : మలయాళం సినిమాలను డిజిటల్ స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు తెలుగు ఆడియన్స్. సరికొత్త కంటెంట్ తో ఈ కథలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మొదలవుతుంది. ఈ సినిమా రెండు జంటల కథను అనుసరిస్తుంది. కొచ్చి స్క్రాప్ ఆర్టిస్ట్ లూకా (టోవినో థామస్), అతని ప్రియురాలు నీహారిక (అహానా కృష్ణ). పోలీసు అధికారి అక్బర్ (నితిన్ జార్జ్), అతని భార్య ఫాతిమా (వినీత కోషి). ఈ చిత్రం ఒక ఆర్టిస్ట్ ప్రేమ, మరణం చుట్టూ తిరిగే థ్రిల్లర్‌గా తెరకెక్కింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఆహాలో స్ట్రీమింగ్
‘Luca’ ఒక మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీని మిక్స్ చేస్తుంది. దీనిని అరుణ్ బోస్ డైరెక్ట్ చేశారు. టొవినో థామస్ (లూకా), అహానా కృష్ణ (నిహారిక), అక్బర్ (నితిన్ జార్జ్), ఫాతిమా (వినీత కోషి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 31 నిమిషాల ఈ సినిమా, IMDbలో 7.4 /10 రేటింగ్ ను పొందింది. 2019,జూన్ 28న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. Aha ఓటీటీలో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళ్తే
లూకా ఒక ప్రతిభావంతమైన స్క్రాప్ ఆర్టిస్ట్, కొచ్చిలో ఒక ఫోర్ట్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అతనికి కాస్త కోపం కూడా ఎక్కువే. థానటోఫోబియా (మరణ భయం)తో బాధపడుతుంటాడు. ఇది అతని తల్లిదండ్రుల మరణం వల్ల బాల్యంలో ఏర్పడింది. అతని జీవితం అతని కళ, కొద్దిమంది సన్నిహిత స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒక సమయంలో అతను నీహారిక అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె ఒక ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ రీసెర్చ్ స్టూడెంట్. తల్లి ఒక మలయాళీ, తండ్రి ఒక బెంగాలీ. బెంగళూరు లో నివాసం ఉంటారు. నీహారికతో పరిచయం చిన్న గొడవతో మొదలవుతుంది. కానీ తరువాత ఆమె క్షమాపణ చెప్పి, అతని ఇంటిలో పేయింగ్ గెస్ట్‌గా చేరుతుంది.
వారి సంబంధం స్నేహంగా మొదలై, క్రమంగా ప్రేమగా మారుతుంది. నీహారికకు కూడా బాల్యంలో ఒక సన్నిహిత బంధువు వల్ల వేధింపులకు గురవుతుంది. ఇది ఆమె జీవితంలో ఒక మానని గాయాన్ని మిగిల్చింది. ఇప్పుడు లూకా ఆమెకు ప్రేమను అందిస్తాడు. అయితే నీహారిక లూకా మరణ భయాన్ని శాంతపరిచే శక్తిగా మారుతుంది. వారి ప్రేమ కథ రంగురంగుల కొచ్చి నేపథ్యంలో, కళాత్మక వాతావరణంలో, ఒక కలల సౌందర్యంతో వికసిస్తుంది. అయితే ఈ కలల ప్రపంచం లూకాకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఛిన్నాభిన్నం అవుతుంది. ఈ వార్త లూకా మరణ భయాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల నీహారిక పడుతున్న బాధను చూసి అతను మరింత ఆందోళనకు గురవుతాడు. ఆమె బాధను చూడలేక, లూకా నీహారికను ఆమె స్వస్థలమైన బెంగళూరుకు పంపిస్తాడు.
మరోవైపు అక్బర్ అనే పోలీసు అధికారి, అతని భార్య ఫాతిమా కథను కూడా ఈ సినిమా చూపిస్తుంది. అక్బర్ తన ప్రేమ సంబంధం హఠాత్తుగా ముగిసిపోవడంతో బాధపడుతుంటాడు. ఫాతిమాతో పెళ్లి తరువాత సమస్యలను ఎదుర్కొంటాడు. ఇద్దరూ ఒక మాట మీద విడాకుల కోసం సిద్ధమవుతారు. ఈ సినిమా లూకా మరణంతో ప్రారంభమవుతుంది. ఇది స్లో పాయిజన్ ద్వారా ఆత్మహత్యగా అనిపిస్తుంది. అయితే అక్బర్ ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు.
దర్యాప్తు సమయంలో, నీహారిక కూడా బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఓరల్ పాయిజనింగ్ ద్వారా మరణించి ఉంటుంది. నీహారిక, లూకాకు పంపిన డైరీ ఒక కీలకమైన సాక్ష్యంగా మారుతుంది. కథ అక్బర్ దర్యాప్తు, లూకా-నీహారిక గత కథను రెండు టైమ్‌లైన్‌లలో చూపిస్తుంది. క్లైమాక్స్‌లో లూకా, నీహారిక మరణాల వెనుక ఉన్న నిజం బయటికి వస్తుంది. వీళ్ళెందుకు ఆత్మహత్య చేసుకున్నారు ? ఆ డైరీలో ఏముంది ? అక్బర్ దర్యాప్తులో ఏం తెలుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫిల్ గుడ్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : భర్త ఇంట్లో ఉండగానే భార్య మాజీ లవర్ ఎంట్రీ… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… కడక్ డార్క్ కథ మావా