OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండు జోరుగా సాగుతోంది. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. మలయాళం నుంచి ఎక్కువగా విజయాలు నమోదు చేసుకుంటున్నాయి ఈ సినిమాలు. మంచి కథలను స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ట్విస్ట్ లతో అదరగొడుతున్న ఈ సినిమాలను చూడటానికి మూవీ లవర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఒక థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఒరే ముఖం‘ (Ore Mukham). ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి సాజిత్ జగద్నందన్ దర్శకత్వం వహించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించారు. 1980ల నాటి కాలంలోని కళాశాల చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఒరే ముఖం 2 డిసెంబర్ 2016న విడుదలైంది. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సంచలనం రేపిన అరవింద్ మర్డర్ కేసును ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే పోలీసులు కంటే ముందే ఈ విషయాన్ని న్యూస్ లో టెలికాస్ట్ చేయాలనుకుంటుంది అమల అనే న్యూస్ రిపోర్టర్. అమల ఈ హత్యను పోతన్ అనే వ్యక్తి చేశాడని తెలుసుకుంటుంది. పోలీసులు కూడా అతని మీదే అనుమానం పడుతుంటారు. అయితే అతడు ఎక్కడున్నాడు అనే విషయం ఎవరికి తెలియకుండా పోతుంది. పోతన్ చదివే స్కూల్ కి వెళ్లి వివరాలు తెలుసుకుంటుంది అమల. పోతన్ ఒక ప్రమాదకరమైన వ్యక్తని, అమ్మాయిలను బెదిరించి దారుణంగా వాడుకుంటూ ఉంటాడని తెలుసుకుంటుంది. ఆ కాలేజీలో గాయత్రి అనే మహిళను వేధిస్తుండటంతో, దేవ్ అనే వ్యక్తి అడ్డుపడి పోతన్ కి బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత వాళ్లతో మంచిగానే ఉంటూ వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేస్తాడు పోతన్.
అలా మొదటి రాత్రి దేవ్ ని చంపి, గాయత్రిని అనుభవిస్తాడు పోతన్. ఆ తర్వాత ఆమెను కూడా చంపేస్తాడు. ఈ జంట హత్యలు అప్పట్లో సంచలనం అవుతాయి. అప్పటినుంచి పోతన్ కనపడకుండా పోతాడు. ఇందులో భాగంగానే అరవింద్ ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అరవింద్ ని ఒక అమ్మాయి విషయంలోనే చంపాడని తెలుసుకుంటుంది. చివరికి పోతన్ పోలీసులకు దొరుకుతాడా? అరవింద్ ని పోతనే హత్య చేశాడా? రిపోర్టర్ అమల వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఒరే ముఖం’ (Ore Mukham) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.