Nindu Noorella Saavasam Serial Today Episode : ఆరు ఎమోషనల్‌గా గుప్తను తిడుతుంది. దీంతో నువ్వు మళ్లీ భూలోకం వెళ్లడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అది ఎందులకు అని మమ్ము అడగకుండా.. వెళ్లి మా ప్రభువుల వారిని ఇరుకున పెట్టుము అని చెప్తాడు గుప్త. ఈ మాత్రం హింట్ ఇస్తే.. ఇక చూడండి ఈ యమపురిలో యమగోల మొదలుపెడతా.. మీ యముడే తలపట్టుకుని నన్ను కిందకు వెళ్లిపోమ్మనెలా చేస్తాను. యమ ఐ యామ్ కమింగ్ అంటూ వెళ్లిపోతుంది.
రణవీర్, అంజలిని తీసుకెళ్లిన హాస్పిటల్‌కు మిస్సమ్మ వస్తుంది. రిసెప్షన్‌లో రణవీర్ పేరుతో ఎంక్వైరీ చేస్తుంది. ఎవరూ అడ్మిట్ కాలేదని చెప్తారు. డాక్టర్ దగ్గర అపాయింట్ తీసుకున్నారా..? అని అడుగుతుంది. చెక్ చేసి లేదని చెప్తుంది. మరోవైపు నర్సు వచ్చి అంజును లోపలికి తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి అంతా రెడీ చేసుకుంటుంది. మిస్సమ్మ హాస్పిటల్ లో వెతుకుతుంది. మిస్సమ్మను చూసిన మనోహరి, రణవీర్ షాక్ అవుతారు. ఆ రాక్షసి పసిగట్టేసింది. ఇక్కడకు కూడా వచ్చేసింది. అని పక్కకు వెళ్లి దాక్కుంటారు. రణవీర్ కంగారుగా ఏంటి మనోహరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు. మనోహరి కూడా కంగారు పడుతూ ఏమో తెలీదు.
కానీ మిస్సమ్మకు నువ్వు అంజలిని కిడ్నాప్ చేసే ప్లాన్‌లో ఉన్నావని తెలిస్తే.. నిన్ను ప్రాణాలతో వదలదు. అది తన జోలికి వచ్చినా వదిలేస్తుందేమో కానీ పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు అంటుంది. ఏంటి మనోహరి నువ్వు నీ ప్రాణాలు నీ కిడ్నాప్ అంటూ మాట్లాడుతున్నావు నీకు ఈ ప్లాన్‌కు సంబంధం లేదా..?అవును ఇదంతా నువ్వు నన్ను అమర్ దగ్గర ఇరికించడానికి వేసిన ప్లాన్ కాదు కదా..? అంటాడు. అయినా మిస్సమ్మ మనల్ని పట్టుకోవడానికి ఒక్క క్షణం దూరంలో ఉంది. ఇప్పుడిలా మనం కొట్టుకుంటూ ఉంటే.. దాని పని ఈజీ అవుతుంది అని మనోహరి చెప్తుంది. మరోవైపు మిస్సమ్మ అంజలిని వెతుక్కుంటూ అంజలి బ్లడ్ శాంపిల్ తీస్తున్న రూం దగ్గరకు వెళ్తుంది. అది గమనించిన మనోహరి, రణవీర్ కంగారుపడుతుంటారు.
అమర్ ఇంటికి వస్తాడు. ప్రయాణం బాగా జరిగిందా నాన్నా.. చూడు రాత్రంతా నిద్ర లేదా… చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది నిర్మల. అవునమ్మా వరుసగా మీటింగ్‌లు ఉన్నాయి అమ్మా అందుకే నిద్ర లేదు అని అమర్ చెప్తాడు. దీంతో నిర్మల మీరేంటో.. మీ డ్యూటీలేంటో నాకు అర్తం కావడం లేదు అంటుంది. అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ వెళ్లి కాఫీ తీసుకురాపో అని చెప్తాడు శివరాం. మిస్సమ్మ లేదా అని అమర్ అడగ్గానే.. ఇందాక రణవీర్ వచ్చి అంజును తీసుకెళ్లాడు..? అంటూ నిర్మల చెప్పబోతుంటే.. ఏయ్ ఆగు ఇంట్లో రాథోడ్ లేడు కదా.? సరుకుల కోసం బయటకు వెళ్లింది అంటూ శివరాం చెప్తూ నువ్వు రూంలోకి వెళ్లి అమర్ కాఫీ రూంలోకే తీసుకొస్తుంది అని చెప్తాడు. అమర్ రూంలోకి వెళ్తాడు.
హాస్పిటల్ లో ఉన్న మిస్సమ్మ రణవీర్‌కు ఫోన్ చేస్తుంది. రింగ్ వినిపించడంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. మనోహరి కంగారుగా సైలెంట్ లో పెట్టు అంటుంది. రణవీర్ కాల్ లిఫ్ట్ చేయబోతుంటే.. ఏయ్ లిఫ్ట్ చేయకు.. ఒక్కసారి చేసినందుకే ఇంతదూరం వచ్చింది. ఈసారి లిఫ్ట్ చేశావనుకో నువ్వు అంజును హాస్పిటల్‌కు తీసుకొచ్చావని ఈజీగా తెలిసిపోతుంది అంటుంది మనోహరి. లిఫ్ట్ చేయకపోతే అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది కదా..? అని రణవీర్ అంటే.. ఏం కాదు అమర్ ఊర్లో లేడు.. ఆధారం లేని అనుమానంతో అమర్‌ను టెన్షన్ పెట్టకూడదు అనుకుంటుంది అందుకే లిఫ్ట్ చేయోద్దు అంటుంది.
ఇంతలో శివరాం, మిస్సమ్మకు ఫోన్ చేసి అమర్ ఇంటికి వచ్చాడని నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే బయటకు వెళ్లావు అని చెప్పాము.. నీకు ఫోన్ చేసినా అదే చెప్పు కానీ హాస్పిటల్‌కు వెళ్లినట్టు చెప్పొద్దు అంటాడు. మిస్సమ్మ సరే అంటుంది. ఆరు యమలోకంలో ఉన్న పది మందిని కూడగట్టుకుని సమ్మే చేస్తుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇంతలో చిత్రగుప్తుడు వచ్చి ఆపండి అని అడుగుతుంది. నన్ను ఎందుకు పాపుల లిస్టులో పెట్టలేదు. నాకు ఎందుకు విముక్తి కల్పించడం లేదు అంటూ నిలదీస్తుంది. ఇంతలో యముడు వస్తాడు. ఆరు తన డిమాండ్లు చెప్పగానే.. యముడు ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు హాస్పిటల్ లో అంజు బ్లడ్ శాంపిల్ తీసుకున్న నర్సు అంజును బయటకు తీసుకొస్తుంది. హాస్పిటల్ లో మిస్సమ్మను చూసి ఇదేంటి ఇక్కడకు వచ్చింది అనుకుంటుంది. ఇంతలో రణవీర్ వెళ్లి అంజును ఆపేస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?