దేశంలో రైల్వే, మెట్రో వ్యవస్థలు చాలా అవసరం. ఈ రెండు వ్యవస్థలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజా రవాణా, సరుకు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే, రైల్వే, మెట్రో వ్యవస్థల నిర్మాణం అనేది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఖర్చు అనేక అంశాల ఆధారంగా మారుతూ ఉంటుంది. దేశంలో రైల్వే, మెట్రో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతి కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులు
⦿భూసేకరణ
రైల్వే ప్రాజెక్టులలో భూసేకరణ అత్యంత ముఖ్యమైన ఖర్చులలో ఒకటి. ప్రాంతాల ఆధారంగా అంటే.. పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలను బట్టి, భూ వినియోగం ఆధారంగా అంటే.. వ్యవసాయ, పారిశ్రామిక, నివాస ఆధారంగా ఖర్చులు మారుతూ ఉంటాయి.
⦿సివిల్ నిర్మాణం
సివిల్ నిర్మాణంలో మట్టి పనులు, ట్రాక్ లేయింగ్, వంతెనల నిర్మాణం, సొరంగాలు, వయాడక్ట్ లు ఉంటాయి. సాధారణంగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఎక్కువ భాగాన్ని సివిల్ నిర్మాణం కలిగి ఉంటుంది.
⦿మౌలిక సదుపాయాలు
ట్రాక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు అంటే.. పట్టాలు, స్లీపర్లు, బ్యాలస్ట్, ఫాస్టెనర్లను కలిగి ఉంటాయి. స్టాండర్డ్ గేజ్, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ సెలెక్షన్ కూడా ధరను ప్రభావితం చేస్తుంది.
⦿స్టేషన్లు, సౌకర్యాలు
స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌లు, డిపోలు, పార్కింగ్ స్థలాలు, వెయిటింగ్ హాళ్లు, అడ్మిన్ భవనాల వంటి సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి.
⦿విద్యుద్దీకరణ
విద్యుదీకరణ అనేది మాస్ట్ లు, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్‌లు, విద్యుత్ లైన్లతో సహా ఓవర్‌హెడ్ ఎలక్ట్రిఫికేషన్ (OHE) వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి కూడా ఖర్చు బాగానే అవుతుంది.
⦿సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్
సురక్షితంగా, సమర్థవంతంగా రైల్వేల నిర్వహణ ఉండాలంటే ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లు, టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకమైనవి.
⦿రోలింగ్ స్టాక్
లోకోమోటివ్‌లు, కోచ్‌లు, వ్యాగన్లతో సహా రోలింగ్ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం వ్యయంలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుంది.
⦿ఇతర ఖర్చులు
ఇతర ఖర్చులలో ప్రాజెక్ట్ నిర్వహణ, భద్రతా చర్యలు, ఎమర్జెన్సీ అంశాలు ఉంటాయి.
దేశంలో కిలో మీటరు రైల్వే ప్రాజెక్టు కోసం అయ్యే ఖర్చు!
పలు నివేదికలు, అధ్యయనాల ఆధారంగా.. దేశంలో రైలు మార్గాన్ని నిర్మించడానికి అంచనా వ్యయం సాధారణంగా కిలో మీటరుకు రూ. 8 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు ఉంటుంది . మెట్రో రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ పద్ధతి, ప్రదేశం ఆధారంగా కిలోమీటరుకు రూ.150 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఉంటాయి. నగరాల్లో భూసేకరణ సమస్య కారణం కాస్ట్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: కళ్లజోడుకు.. రైల్వే జాబ్స్ కు లింకేంటి? A1, B2 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి?