BigTV English

OTT Movie : ట్రీట్ మెంట్ కోసం వెళ్తే పషెంట్ కి కడుపు చేసే డాక్టర్…

OTT Movie : ట్రీట్ మెంట్ కోసం వెళ్తే పషెంట్ కి కడుపు చేసే డాక్టర్…

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ చూస్తారు. మంచి కంటెంట్ తో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటిటిలలో 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ఎ డేంజరస్ మెథడ్‘ (A Dangerous method). ఇది ఒక సైకలాజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చింది. హీరోయిన్ కి మానసిక ప్రాబ్లం ఉండటంతో డాక్టర్ ఏవిధంగా క్యూర్ చేసి, తనతో లవ్ లో పడ్డాడో మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)  ఆపిల్ టీవీ (apple tv) లలో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ కు మానసిక ప్రాబ్లం ఉండటంతో ఒక హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆమెకు చిన్నప్పటినుంచి ఆ ప్రాబ్లం తో బాధపడుతూ ఉంటుంది. కార్ల్ అనే డాక్టర్ ఈమెకు ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తాడు. ఆమెకు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. ఆమెతో ఇలా ఉండటానికి ఏమైనా చెప్పుకోలేని విషయాలు ఉనాయా అని డాక్టర్ కార్ల్ హీరోయిన్ ని అడుగుతాడు. తన తండ్రి వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ తో చెబుతుంది. అప్పుడు డాక్టర్ హీరోయిన్ కు ట్రీట్మెంట్ చేస్తూ, ఒక థియరీను కూడా కనుక్కుంటాడు. ఆ థియరీ తో మానసిక సమస్యలను ఏ విధంగా నయం చేయవచ్చు అనేది ఉంటుంది. కార్ల్ కి ఫ్రడ్ అనే ప్రొఫెసర్ స్నేహితుడిగా ఉంటాడు. వీళ్ళిద్దరూ హీరోయిన్ గరించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఫ్రడ్ హీరోయిన్ ని ఒక యూనివర్సిటీకి పంపించమని కార్ల్ కు చెప్తాడు. కార్ల్ ఆమెను యూనివర్సిటీకి పంపిస్తాడు. అక్కడ వెళ్లిన ఆమె మళ్ళీ తిరిగి కార్ల్ దగ్గరకి వస్తుంది.

అయితే ఈసారి వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. కార్ల్ హీరోయిన్ తో ఎక్కువ సన్నిహితంగా మెలుగుతాడు. ఇలా ఉండగా హీరోయిన్ డాక్టర్ కార్ల్  ద్వారా పిల్లలు కావాలని అతనితో చెప్తుంది. నాకు ఫ్యామిలీ ఉందని ఇది ఇక్కడితో ఆపేద్దామని కార్ల్ హీరోయిన్ కు చెప్తాడు. అందుకు ఒప్పుకోని హీరోయిన్, ఆ డాక్టర్ తో గొడవపడి, మన విషయం అందరికీ చెప్పి నీ పరువు తీస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిరోజుల తర్వాత హీరోయిన్ ను ఒకచోట అనుకోకుండా  కలుస్తాడు కార్ల్. ఆశ్చర్యంగా ఆమె గర్భవతిగా ఉంటుంది. హీరోయిన్ కి గర్భం ఎవరి ద్వారా వచ్చిందో తెలిసి డాక్టర్ షాక్ అవుతాడు. హీరోయిన్ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు? హీరోయిన్ మరెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటుందా? వీరిద్దరూ మళ్లీ ప్రేమించుకుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

Big Stories

×