Action Movie In OTT : ఓటీటీలో యాక్షన్ సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని సైన్స్ కు అందని మిస్టరి సినిమాలకు డైరెక్టర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. సైన్స్ ప్రిక్షన్ మూవీలకు కొందరు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ ఏడాది చాలా ప్రయోగాత్మక సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. థియేటర్లలోకి వచ్చిన కొన్ని సినిమాలు సక్సెస్ టాక్ అందుకోలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మొన్నటివరకు హారర్ సినిమాలకు ఎక్కువ ప్రాదాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్షన్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. దాంతో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కూడా కొదవలేదనే చెప్పాలి. థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో యాక్షన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ భారీ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ను ఒకసారి తెలుసుకుందాం..
వెట్రిమారన్ తమిళ్ యాక్షన్ డ్రామా మూవీ సార్ థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రెండు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలలో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళంతో పాటు ఐదు భాషల్లో విడుదలకాగా…ఆహా ఓటీటీలో కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.. తమిళ హీరో విమల్, ఛాయా దేవి హీరోహీరోయిన్లుగా నటించాడు. కోలీవుడ్ యాక్టర్ బోస్ వెంకట్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ మూవీకి ప్రజెంటర్‌గా వ్యవహరించడం దీనికి భారీ హైప్ ను క్రియేట్ చేసిందని వార్తలు తమిళ ఇండస్ట్రీలో వినిపించాయి. విద్యా వ్యవస్థకు సంబంధించిన ఓ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను జోడించి దర్శకుడు బోస్ వెంకట్ ఈ కథను రాసుకున్నాడు. పాయింట్ బాగున్నా ఎంగేజింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ కాస్త వెనక్కి తగ్గాడు. దాంతో మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. హీరో తన తండ్రి టీచర్ గా పనిచేస్తున్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతాడు. టీచర్ జాబ్ ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేకపోతాడు. తాను టీచర్‌గా పనిచేస్తోన్న ఊరిలో తక్కువ కులం పిల్లలు చాలా మంది చదువుకు దూరమయ్యారని జ్ఞానం తెలుసుకుంటాడు. వారందరని స్కూల్‌లో చేర్పించే ప్రయత్నంలో ఊరి పెద్ద శక్తివేల్‌తో విరోధం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవుతాయి. అయితే హీరో పనిచేసే స్కూల్‌ను శక్తివేల్ కూలగొట్టే ప్రయత్నం చేస్తాడు. శక్తివేల్ రాజకీయ, ధన బలం నుంచి జ్ఞానం తన స్కూల్‌ను ఎలా కాపాడుకున్నాడు? ఈ పోరాటంలో వల్లి అతడికి ఎలా అండగా నిలిచింది? అనేది ఈ మూవీ స్టోరీ.. ఈ సినిమా డైరెక్టర్ మొదటి సినిమా హీరోతోనే రెండో సినిమా కూడా చేసాడు. ఇక నటుడుగా తన సత్తాను చాటుకున్నాడు. ఏకంగా 100 సినిమాలకు పైగా సినిమాలు చేసాడు. థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..