Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల పేరు తెలియని వాళ్ళు ఉండరు. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి రావడమంటే అందం, టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు ఒకే అమ్మాయిలో ఉండడంవిశేషం.. ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది. ఇక మొన్నటివరకు క్యూట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఐటమ్ పాప అదుర్స్ అనే టాక్ ను అందుకుంది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్ప 2 లో ఈ అమ్మడు కిస్సిక్ అనే ఐటమ్ సాంగ్ చేసింది. దాంతో ఇప్పుడు ఐటమ్ గర్ల్ అనే పేరును అందుకుంది. అయితే ఈ బ్యూటికి ఆ పేరు నచ్చలేదో, మారేదో కారణమో తెలియదు కానీ అలాంటి తప్పు మళ్లీ చెయ్యను అంటూ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం..
రాఘవేందర్ రావు ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. అంతకు ముందు ఈమె గతంలో కన్నడలో పలు సినిమాల్లో నటించింది కానీ, అవి ఆమెకు అనుకున్న స్థాయి గుర్తింపుని మాత్రం తీసుకొని రాలేకపోయాయి. ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది మాత్రం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పాపకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.రవితేజ తో కలిసి ఈమె నటించిన ‘ధమాకా’ చిత్రం ఈమె కెరీర్ లో ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ చూసి ఈలలు వెయ్యని తెలుగోడు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ గా హిట్ సినిమాలు లేకున్నా డ్యాన్స్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ అల్లు అర్జున్ రీసెంట్ మూవీ పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేసి కుర్రాళ్ల మనసు దోచుకుంది. ఆ పాట ఓ ఊపు ఊపేస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ వల్లే చిరంజీవికి నో..
నిజానికి ఐటెమ్ సాంగ్ చేయడం శ్రీలీలకు ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా కావొచ్చు. ఇక మీదట ప్రత్యేక గీతాలకు దూరంగా ఉండాలని శ్రీలీల భావిస్తోంది. ఓ కథానాయిక ఐటెమ్ పాట చేస్తే, ఆ పాట హిట్టయితే, ఇక మీదట అలాంటి అవకాశాలే వస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ సొమ్ము చేసుకొనే వీలుంది. కానీ హీరోయిన్ గా కేరియర్ క్లోజ్ అయ్యి ‘ఐటెమ్ గాళ్’ అనే ముద్ర పడిపోతుంది. ఈ బ్రాండ్ వేసుకోవడం శ్రీలీలకు ఏమాత్రం ఇష్టం లేదు. ‘పుష్ప 2’కి ముందు కూడా కొన్ని ఐటమ్ సాంగ్ ఆఫర్లు అందాయి. కానీ కూల్ గా నో చెప్పిందట.. మెగా స్టార్ చిరంజీవి `విశ్వంభర`లో ఓ ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఆఫర్ కు నో చెప్పిందట.. కేవలం అల్లు అర్జున్ తో డ్యాన్స్ చెయ్యాలనే కోరికతో ఒకే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చిందట. చిరంజీవికి నో చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ కు గురైంది. ఏది ఏమైనా ఇక మీదట ఇలాంటి సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చెయ్యనని చెప్పేసింది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈనెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఆ మూవీతో హిట్ కొడుతుందేమో చూడాలి..