BigTV English

OTT Movie : కన్నార్పకుండా చూసే అడ్వెంచర్ థ్రిల్లర్… భార్యా బిడ్డల కోసం ప్రాణాల మీదకు

OTT Movie : కన్నార్పకుండా చూసే అడ్వెంచర్ థ్రిల్లర్… భార్యా బిడ్డల కోసం ప్రాణాల మీదకు

OTT Movie : కొన్ని సినిమాలు చూసిన కాసేపటికి మర్చిపోతాం మరికొన్ని ఎంటర్టైన్మెంట్ చేయడంతో మరికొన్ని రోజులు గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి సినిమా ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పురాతన కాలంలో నివసించే ఆటవిక మనుషుల గురించి తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఆదరించారు మూవీ లవర్స్. ఈ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు “అపొకలిప్టో” (Apocalypto).ఈ మూవీ నాగరికత మొదలవుతున్న రోజుల్లో కొంతమంది ఆటవికులు, చిన్నచిన్న ఊర్లపై దాడి చేసి వాళ్ళని బందీలుగా తీసుకుని నరబలులు ఇస్తూ ఉంటారు. ఈ మూవీని  మొదటి నుంచి చివరి దాకా కన్నార్పకుండా ఉత్కంఠతో చూస్తారు మూవీ లవర్స్.  ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అప్పుడప్పుడే నాగరికత మొదలవుతున్న దశలో హీరో కుటుంబంతో సహా ఒక అటవీ ప్రాంతంలోని, ఒక చిన్న గూడెంలో నివసిస్తూ ఉంటాడు. వారికి రాజులు రాజ్యాలు ఇవేమీ తెలియవు. అటవీ ప్రాంతంలో దొరికే వస్తువులను ఆహార పదార్థాలుగా చేసుకుంటూ జీవిస్తుంటారు. హ్యాపీగా ఉంటున్న ఈ గూడెంకు అనుకోకుండా ఒక ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న కొంతమంది ఆటవికులు, చిన్నచిన్న గూడెం లో ఉన్న మనుషులను బంధించి తీసుకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో ఉంటున్న గూడెం లో అందరిని బంధించి తీసుకువెళ్తారు. గర్భవతిగా ఉన్న తన భార్యని కుమారుడిని ఒక బావిలో ఉంచి ఆటవికులకు హీరోలొంగిపోతాడు. ఆటవికులు వీళ్లను హింసిస్తూ వాళ్ళు ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్తూ ఉంటారు. మార్గమధ్యంలో ఈ అటవీకులు చేసే అరాచకం అంతా ఇంతా కాదు. ఒళ్ళు గగుర్పాటుకు గురి  చేసే  సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. చివరికి ఈ గూడెం వాళ్లను ఆటవికులు వాళ్ళ ప్రాంతానికి తీసుకువెళ్తారు.

అక్కడ దేవుడి కోసం నరబలిని ఇస్తూ ఉంటారు. వీళ్లను కూడా అదే క్రమంలో నరబలిస్తూ ఉంటారు. హీరో వంతు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. నరబలిని ఆ ఊరి పెద్ద వాయిదా వేస్తాడు. ఈ క్రమంలో హీరోని కట్లు విప్పి వెళ్ళిపొమ్మని చెప్తారు. హీరోతో పాటు అతని ఫ్రెండ్స్ కి కూడా అలాగే వెల్లమంటారు. వెళ్తున్న వారిని బాణాలతో వెంటాడుతూ తరుముతూ చంపుతారు. అలా చివరికి హీరో ఒక్కడు మాత్రం మిగుల్తాడు. హీరోని వెంబడిస్తున్న వాళ్లకి హీరో చుక్కలు చూపిస్తాడు. వెంబడిస్తున్న వాళ్ళందరినీ తనకు తెలిసిన ఆటవి ప్రాంతంలోని పనిముట్లతో చంపుతూ ఉంటాడు. చివరికి హీరో ఆ గూడెంకి చేరుతాడా? తన భార్య బిడ్డల్ని కాపాడుకుంటాడా? వీళ్లంతా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అడ్వెంచర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×