BigTV English

Balakrishna : బాలయ్య సంక్రాంతి సినిమాలు.. ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

Balakrishna : బాలయ్య  సంక్రాంతి సినిమాలు.. ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయసు పెరుగుతున్నా సినిమాల విషయంలో తగ్గేదేలే అంటూ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డాకు మహారాజ్ అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే డేట్ కూడా అనౌన్స్ చేశారు. గతేడాది సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలయ్య.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాలయ్య ఇప్పటివరకు చేసిన సంక్రాంతి సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


గతంలో బాలయ్య నటించిన సినిమాలు ఇదే సీజన్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఆయన 108 సినిమాల్లో నటిస్తే, వాటిలో 22 చిత్రాలు సంక్రాంతి పండుగకే థియేటర్లలోకి వచ్చాయి. అందులో ఎక్కువ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. బాలయ్య సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి అంటే నందమూరి ఫ్యాన్స్ కు పునకాలే అని చెప్పాలి.. ఇప్పుడు తన 109వ సినిమాతో మరోసారి ఫెస్టివల్ బరిలో దిగుతుడం, నటసింహం ఈ మధ్య మంచి ఫామ్ లో ఉండటంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాల్లో ఎన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయో ఆ సినిమాల లిస్ట్ ఒకసారి చూసేద్దాం..

బాలయ్య కేరీర్ స్టార్ట్ చేసిన సమయంలో వేములవాడ భీమకవి’ సినిమా సంక్రాంతికి రిలీజైంది. ఆ తర్వాత ‘దాన వీర శూర కర్ణ’, ‘అనురాగ దేవత’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక బాలయ్య సోలో హీరోగా మారిన తర్వాత ‘డిస్కో కింగ్’ మూవీతో తొలిసారిగా సంక్రాంతికి వచ్చారు. ఇదే క్రమంలో ‘ఆత్మబలం’, ‘భార్గవ రాముడు’, ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’, ‘ప్రాణానికి ప్రాణం’ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ‘వంశానికొక్కడు’, ‘పెద్దన్నయ్య’ సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టాయి. ‘సమర సింహారెడ్డి’ చిత్రం సూపర్ హిట్టైంది. ‘నరసింహ నాయుడు’ బ్లాక్ బస్టర్ అవ్వగా.. ‘వంశోద్ధారకుడు’, ‘సీమ సింహం’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘లక్ష్మీ నరసింహ’ హిట్ స్టేటస్ సాధించగా.. ‘ఒక్క మగాడు’, ‘పరమవీర చక్ర’ సినిమాలు బిగ్గెస్ట్ డిజస్టర్లుగా మారాయి..


ఇక గౌతమి పుత్ర శాతకర్ణి’ సీజన్ ను క్యాష్ చేసుకుని హిట్ అనిపించుకుంది. ‘జై సింహా’ పరాజయం చెందగా.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది.. గత ఏడాది పొంగల్ కు వీర సింహా రెడ్డి’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 2025 ఫెస్టివల్ సీజన్ లో ‘డాకు మహారాజ్’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తుందనే చెప్పాలి.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘డాకు మహారాజ్’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×