Brahmamudi serial today Episode: ఇంట్లో బాధ్యతలు చూసుకోవడానికి పిన్ని ఉంది కదా అంటాడు రాజ్. దీంతో ఇప్పటికే ఇంట్లో వేరు కుంపటి పెట్టుకున్న మీ పిన్ని ఇంటి బాధ్యతలు ఎలా చూసుకుంటుందని ప్రకాష్ చెప్పగానే ధాన్యలక్ష్మీ ప్రకాష్‌ను తిడుతుంది. నేను చేసేదంతా మన కళ్యాణ్ కోసమే అంటుంది. ఇంతలో సుభాష్.. అదంతా కాదు కానీ నువ్వు వెళ్లి మీ అమ్మను తీసుకురా అంటూ రాజ్‌కు చెప్తాడు. నేను తీసుకురాలేనని మామ్ రానని కరాకండిగా చెప్పేసింది. ఇక నేనేం చేయలేను అంటూ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి బాధపడుతూ ఇంటి కోడలిని బాధపెట్టిన ఏ కుటుంబం బాగుపడదు. ఇప్పుడు రెండు తరాల కోడళ్లను బాధపెడుతున్నాం. అంటూ వెళ్లిపోతుంది. నా ఆస్థి నాకు దక్కాలంటే ఇదే కరెక్టు టైం ఇప్పుడు ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టాలి. ఈ గొడవ మరింత పెద్దది చేయాలి అనుకుంటుంది రుద్రాణి.
సుభాష్, అపర్ణకు ఫోన్ చేసి నువ్వు ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిపోతుంది అని చెప్తాడు. అనుకున్నవన్ని జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుందండి కష్టపడాలి సాధించాలి అని అపర్ణ చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండి.. ఇంకో రెండు రోజుల్లో వాడు వాడి తప్పు తెలుసుకుని వస్తాడు అని చెప్తుంది. ఇంతలో కావ్య అక్కడకు వచ్చి తప్పు చేస్తున్నావు అత్తయ్యా అంటుంది. మీ అబ్బాయితో కలిసి వెళ్లిపోవాల్సింది అంటుంది. నేను ఇక్కడ నీకు భారంగా ఉన్నానా..? నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. అయినా ఈ మధ్య నాకు సలహాలు ఇచ్చే వాళ్లు ఎక్కువ అయిపోయారు అంటుంది అపర్ణ. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది. కొంచెం ప్రేమగా ఉండేవారు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా మీద అరుస్తున్నారు అంటూ కావ్య అనగానే.. ఇన్ని రోజుల ప్రేమగా చెప్పినందుకే నువ్వు నీ మొగుడు కలిసి కాపురాన్ని ఇలా వెలగబెట్టారు అంటూ తిడుతుంది అపర్ణ.
ధాన్యలక్ష్మీ ఆలోచిస్తూ కూర్చుంటే రుద్రాణి వెళ్తుంది. నువ్వు ఎంతలా ఆలోచించినా ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ నీ కొడుకుకు జరిగే న్యాయం ఏమీ ఉండదు. వాడు ఆటో నడపక తప్పదు. నా మాటలు నీకు కోపం తెప్పించవచ్చు కానీ ఆలోచిస్తే నిజం కనిపిస్తుంది అని రుద్రాణి అంటుంది. నిజం కనిపిస్తుంది కాబట్టే వేరు కుంపటి పెట్టాను అంటుంది ధాన్యలక్ష్మీ. పెట్టి ఏం సాధించావు. నీ వంట నువ్వు చేసుకోవడం తప్పా.. ఈ ఇంట్లో మన పొజిషన్ ఏంటో మన మాటకు ఇచ్చే విలువ నువ్వే ఆలోచించు. నీ కొడుకుకు న్యాయం కావాలని అడిగితే టైం అడిగారు. అదే కావ్యను ఆఫీసులోంచి పంపించేయగానే మా వదిన అక్కడకు వెళ్లి కూర్చుంది. కావ్యను ఇంటికి తీసుకొచ్చేయాలి. కళ్యాణ్ గురించి అయితే టైం కావాలని అంటున్నారు. నేను నీకు సపోర్టు చేద్దామంటే నన్ను విలన్ చేస్తున్నారు. ముందు ఈ ఇంట్లో ఎవరినో ఒకరిని నీవైపు తిప్పుకో అంటూ రుద్రాణి చెప్తుంది.
కళ్యాణ్, అప్పు ఇద్దరూ కలిసి పానీపూరి బండి దగ్గరకు వెళ్లి పానీపూరి తింటుంటారు. ఇంతలో అక్కడకు అనామిక వస్తుంది. నా గెస్ నిజమైంది. ఆదర్శ ప్రేమికులు రోడ్డు మీద పడ్డారు అంటుంది. మనుషులు అన్నాక రోడ్డు మీదే తిరుగుతారు అంటుంది అప్పు. రోడ్డు మీద తిరగడానికి, రోడ్డున పడటానికి చాలా తేడా ఉంది అప్పు. అసలు ఏంటి నీ సమస్య.. సమస్యలు మీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతావేంటి అంటుంది అనామిక. మాకేం సమస్యలు లేవే.. మేము హ్యాపీగానే ఉన్నాము అంటుంది అప్పు. ఇలా రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తింటూ హ్యాపీగా ఉన్నారా..? అని అనామిక అడగ్గానే మేము ఏ ఫుడ్డు తిన్నా.. నీ బాడీలో ఉన్నంత కొలెస్ట్రాల్ , కొవ్వు మాకు లేవులే.. అంటుంది అప్పు. దీంతో కళ్యాణ్‌ను అనామిక తిడుతుంది. మీ అన్నయ్య కాళ్లు పట్టుకుని ఆస్థి తీసుకుని బాగుపడు. అంటూ కళ్యాణ్‌ను ఇంసల్ట్ గా మాట్లాడి వెళ్లిపోతుంది అనామిక.
స్వప్న జ్యూస్ తాగుతుంటే రుద్రాణి వచ్చి శాంతతో ఇంట్లో నేను కూడా ఉన్నాను. మాకు జ్యూస్ ఇవ్వాలని తెలియదా..? అంటూ తిడుతుంది. దీంతో నేను టీ తీసుకొచ్చిన్నప్పుడు మీరు లేరు. టిఫిన్ చేసినప్పుడు మీరు రాలేదు అంటుంది శాంత. దీంతో రుద్రాణి కోపంగా రూంలో ఉంటే వచ్చి పిలవాలని లేదా..? అంటూ తిట్టడంతో స్వప్న అడ్డు వస్తుంది. రుద్రాణి, స్వప్నల మధ్య గొడవ జరుగుతుంది. దీంతో శాంత మీకెందుకు గొడవ నేను వెళ్లి మీకు జ్యూస్ తీసుకొస్తాను అంటుంది.
రాజ్ నిద్రపోతుంటే సుభాష్ వచ్చి రాజ్ రూంలో పడుకుంటాడు. దీంతో రాజ్ కంగారుగా డాడీ మీరు ఇక్కడ పడుకుంటారా..? అని అడుగుతాడు. మీ బెడ్‌రూంలో దొమలు ఎక్కువ ఉన్నాయా..? అని అడుగుతాడు. ఏమీ లేవని కానీ నిద్ర పట్టడం లేదు. మీ అమ్మ లేదు కాబట్టి ఆ రూంలో నిద్ర పట్టడం లేదు. అక్కడ నేను ఉండలేకపోతున్నాను. పడుకోలేకపోతున్నాను. అందుకే ఇక్కడ పడుకోవడానికి వచ్చాను. నీకు అభ్యంతరం అయితే చెప్పు నేను మా నాన్న రూంలో పడుకుంటాను అంటాడు సుభాష్. నాకేం అభ్యంతరం లేదు కానీ మమ్మీ లేకపోతే నిద్రపట్టడం లేదని చెప్తుంటేనే వినడానికి విచిత్రంగా ఉంది అంటాడు రాజ్. అందరికీ నీలాగా ఒంటరిగా పడుకునే ప్రాప్తం ఉండదు కదా..? అంటాడు సుభాష్.
బెడ్‌రూంలో ఉన్న ధాన్యలక్ష్మీ, ప్రకాష్ గొడవ పడతారు. కళ్యాణ్ విషయంలో నువ్వేమీ చేయడం లేదేంటని ప్రకాష్‌ను నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. మీరు ఇప్పుడే వెళ్లి ఆస్థి విషయంలో వారితో మాట్లాడండి అంటుంది. దీంతో కోపంగా ప్రకాష్ మాట్లాడను అంటే ఏం చేస్తావు అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా దిండు, దుప్పటి ఇచ్చి ప్రకాష్‌ను బయటకు గెంటివేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్