OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలలో వచ్చే సీన్స్ కోసమే అదే పనిగా మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ అలాంటిదే అయినప్పటికీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘బాలక్ పాలక్‘ (Balak Palak) .ఈ మరాఠీ మూవీకి రవి జాదవ్ దర్శకత్వం వహించారు. వయసుకు వస్తున్న కొంతమంది పిల్లలు కొన్ని వీడియోలు చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ పిల్లల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ కామిడీ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) వీడియొలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
అభి, బాగి, చైతు, డాళి వీళ్ళందరూ స్కూల్ కి వెళ్తూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే వీరి వీధిలో ఉండే ఒక అమ్మాయి ప్రేమ పేరుతో వేరొక వ్యక్తితో వెళ్లిపోయి ఉంటుంది. ఆమె గురించి వీధిలో అందరూ అదోలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పదాలకు అర్థం తెలియని ఈ చిన్న పిల్లలు వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వీరికి విష్ణు అనే పిల్లవాడు పరిచయం అవుతాడు. అతడు వీళ్ళకు ఆ బుక్కులు ఇస్తాడు. ఆ బుక్కులు ఈ పిల్లలు ఎవరికీ తెలీకుండా చదువుతూ ఉంటారు. అయితే వీడియో ద్వారా వాటిని చూడొచ్చని విష్ణు వాళ్లకి చెప్తాడు. ఈ క్రమంలో దానికి కావాల్సిన డబ్బులను వీళ్లు అరేంజ్ చేసుకుంటారు. ఒకరోజు ఈ పిల్లలు అందరూ కలిసి ఆ వీడియోని చూస్తారు. అప్పటినుంచి వీళ్ళకి ఆడవాళ్ళ మీద చెడు ఆలోచనలు వస్తాయి. అభి ఒకసారి చైతు చేయి పట్టుకుంటాడు. ఆతరువాత ఆ అమ్మాయి అతనికి దూరంగా ఉంటుంది.
విష్ణు అక్కడే ఉండే నేహా అనే అతని కన్నా పెద్దదైన అమ్మాయిని అదోరకంగా చూస్తూ ఉంటాడు. ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళ చేష్టలతో అందరూ ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత విష్ణు కూడా నేహాతో ఐ లవ్ యు చెప్తాడు. అతన్ని చిన్న పిల్లాడిగా చూసుకునే నేహా, ఆ పిల్లవాడు అలా చెప్పేసరికి షాక్ అవుతుంది. ఈ విషయం విష్ణు తండ్రికి తెలుస్తుంది. చివరికి విష్ణు తండ్రి ఆ పిల్లలను దండిస్తాడా? ఆ వీడియోలను ఆ పిల్లలు చూడడం ఆపుతారా? ఆ వీడియోలు చూడడం వల్ల ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలక్ పాలక్’ (Balak Palak) రొమాంటిక్ కామిడీ మూవీని చూడాల్సిందే.