OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. వీటిలో ఫ్యామిలీ డ్రామా సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేసింది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
జి ఫైవ్ (Zee5)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీ పేరు బిజోయ (Bijoya). ఈ మూవీలో భర్త, ప్రియుడి మధ్యలో భార్య నలిగిపోతుంది. వీరి ట్రైయాంగిల్ ప్రేమ కథ చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బంగ్లాదేశ్ లో ఉండే గణేష్ తన భార్య పద్మ, పిల్లవాడితో కలసి హ్యాపీగా ఉంటాడు. అయితే ఇతనికి గుండె జబ్బు రావడంతో హాస్పిటల్ కి వెళ్లాలనుకుంటారు. ఇండియాలో ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కి వస్తారు. గణేష్ ని చెక్ చేసిన డాక్టర్ వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్తాడు. గణేష్ భార్య పద్మ టాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్ కు వెళ్తుంది. అక్కడ పద్మ మాజీ బాయ్ ఫ్రెండ్ నజీర్ పనిచేస్తుంటాడు. ఇతన్ని చూసిన పద్మ షాక్ అవుతుంది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకొని ఉంటారు. ఆ తరువాత నజీర్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. పద్మ గణేష్ ని పెళ్లి చేసుకుంటుంది. మెడికల్ షాపులో నజీర్ని చూసిన తర్వాత, పద్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్తుంది. వారి దగ్గరికి నజీర్ వచ్చి మీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అని చెప్తూ, కొంత డబ్బును కూడా ఇస్తాడు. పద్మ ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఉండగా, ఆ వాతావరణం సరిగ్గా లేనందువలన నజీర్ పద్మని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ట్రీట్మెంట్ అయ్యేంతవరకు గణేష్,పద్మని తన ఇంట్లో ఉండమని చెప్తాడు. పద్మ కి ఒక కొడుకు ఉంటాడు. అతని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది.
అది చూసిన నజీర్ ఆ పిల్లవాడు గణేష్ కి పుట్టినవాడు కాదు అని తెలుసుకుంటాడు. ఆ పిల్లవాడు తన కొడుకు అని తెలుసుకొని అతనిని ప్రేమగా చూసుకుంటాడు. ఆ మరుసటి రోజు డాక్టర్ గణేష్ ని పరీక్షించి ఇప్పుడు ఆపరేషన్ చేయలేమని, నీ శరీరం అందుకు సిద్ధంగా లేదని చెప్తారు. ఇంటికి వచ్చిన గణేష్ నేను కొంతకాలమే బతుకుతాను, ఆ తర్వాత మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అని నజీర్ తో చెప్తాడు. ఒక లెటర్ రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ లెటర్లో నేను బతికున్నంత కాలం నువ్వు నజీర్ని పెళ్లి చేసుకోలేవు అందుకే నేను చనిపోవాలి అనుకుంటున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని రాసి ఉంటుంది. చివరికి పద్మ భర్త కోసం వెతుకుతుందా? నజీర్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుందా? గణేష్ మళ్లీ తిరిగి వస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.