E-Paper
Advertisement

OTT Movie : ఆస్తి కోసం తన లవర్ ని తండ్రికి ఎరగా వేసే కొడుకు…. కన్నింగ్ క్రైమ్ స్టోరీ

OTT Movie : ఆస్తి కోసం తన లవర్ ని తండ్రికి ఎరగా వేసే కొడుకు…. కన్నింగ్ క్రైమ్ స్టోరీ
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి చివరి దాకా ఈ సినిమాలను కుర్చీలకు అతుక్కుని చూస్తారు. అంతేకాక రొమాంటిక్ కంటెంట్ తో వచ్చే సినిమాలు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు ‘డిస్మే‘ (Dismay). ఈ మూవీలో ఒక కుటుంబంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వలన ఆ ఇంట్లో అలజడి చెలరేగుతుంది. వాళ్ళ ఆస్తి ఎవరికి దక్కుతుంది అనేది చివరి వరకు సస్పెన్స్. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

డాన్టీ అనే వ్యక్తికి కొంత వ్యవసాయ భూమి ఉంటుంది. ఆ పొలంలో ఒక కంపెనీ రిసార్ట్ కట్టాలనుకుంటుంది. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా అతను ఆ పొలాన్ని కంపెనీకి అమ్మడు. అయితే ఇతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. కొలాండో పెద్ద కొడుకు, రోలాండ్ చిన్న కొడుకు. డాన్టీ భార్య క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది. ఆమెను చూసుకోవడానికి అలైస్ అనే అమ్మాయిని తీసుకువస్తాడు. ఆమెతో డాన్టీ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం అన్నదమ్ములకు తెలిసి, తండ్రి ఆమె మాయలో పడి ఆస్తి మొత్తం ఆమెకే రాసిస్తాడు అనుకుంటారు. ఆ తర్వాత డాన్టీ భార్య చనిపోతుంది. అలైస్ ని ఇంట్లో నుంచి పంపాలని అన్నదమ్ములు మాట్లాడుకుంటారు. కొలాండో ఆమెతో మాట్లాడుతూ ఏకాంతంగా గడుపుతాడు. ఆమెను ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే, ఆమెతో సరసాలు సాగిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో, రొనాల్డో తన తండ్రి కి విషయం చెప్తాడు. తండ్రి కోపంతో తుపాకి తీసుకొని కొలాండోని కాల్చి చంపేస్తాడు.

కొలాండో భార్య తన భర్తని చంపుతావా అంటూ, అదే గన్ తీసుకుని డాన్టీని  షూట్ చేయడంతో అతనుకూడ చనిపోతాడు. చివరికి తమ్ముడు రోలాండ్ కొలాండో మిగులుతారు. అలైస్ చాలా కాలం నుంచి రోలాండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీకి తను ఒక్కడే ఆస్తిని అమ్మాలనుకుంటాడు రోలాండ్. ఈ పథకంలో భాగంగా అలైస్ తండ్రికి దగ్గర అయ్యేలా చేస్తాడు. అన్నతో అలైస్ ఏకాంతంగా ఉన్న సమయంలో తండ్రికి కావాలనే చెప్తాడు. ఆ కోపంలో అన్నని చంపేస్తాడు తండ్రి. రోలాండ్ వేసిన ప్లాన్ సక్సెస్ కావడంతో చివరికి ఆ ఆస్తిని రోలాండ్ ఒక్కడే అనుభవిస్తాడా? అలైస్ తో ఇతనికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడండి.

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×