Venu Madhav : టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి తన కామెడితో జనాలను కడుపుబ్బా నవ్వించాడు. ఎన్నో వందల సినిమాల్లో ఆయన నటించి అందరి మనసులో హాస్య నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అందుకే ఆయన సినిమాలను జనాలు ఇప్పటికి ఆదరిస్తున్నారు. నటుడుగా బాగా సక్సెస్ అయిన ఆయన చనిపోవడం అందరిని బాధించింది. చివరి రోజుల్లో ఆయన పడిన ఆవేదన అందరిని కన్నీరు పెట్టించింది. అసలు ఆయనకు అంతగా బాధ వేసిన సంఘటన ఏంటో అని చాలా మందికి సందేహం రావొచ్చు. నిజానికి ఆయన అనారోగ్య సమస్యల కన్నా ఒక మానసిక బాధ ఆయనను క్రుంగిపోయేలా చేసింది. దాంతో ఆయన మంచం పడ్డారు. చనిపోయారు. ఆ బాధ ఏంటి? దానివల్ల ఆయన చనిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానం ఏంటో చూద్దాం..
మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి, గొప్ప కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు వేణుమాధవ్. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం చిత్రం తో హాస్య నటుడుగా ఆరంగ్రేటం చేసాడు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక లక్ష్మీ చిత్రంలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతల తో చేసిన కామెడీ ఆ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. అలా ఆయన నటించిన దిల్, సై, ఆది, సాంబ, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి ఎన్నో సినిమాల లో తన మార్క్ కామెడితో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.
నటుడుగా ఎంట్రీ ఇవ్వక ముందు ఎన్ని సీరియల్స్ లలో నటించాడని టాక్. స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడట.. ఇక వేణు మాధవ్ మొదటి చిత్రంలోనే ఏకంగా 70 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. వేణు మాధవ్ కు ఇష్టమైన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కాగా ఆయన పై ఉన్న అభిమానంతో చాలా సందర్భాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. తన అభిమాన నటుడు పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు రాజకీయాల్లో కి వచ్చి ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్న వేణు మాధవ్ కొన్ని కారణాల వల్ల ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయాడు. 2019 సెప్టెంబరు 25 న వేణు మాధవ్ మృతి చెందాడు. అప్పటి నుంచి వేణు మాధవ్ మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉంది. నిజానికి ఆయన మృతి చెందడానికి అసలు కారణం తన సోదరుడి మరణం అంట. వేణు మాధవ్ చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన సోదరుడు మరణించాడని, ఆ సంఘటన తో వేణు మాధవ్ డిప్రెషన్ కు గురయ్యాడని తన కుటుంబ సభ్యులు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కిడ్నీల సమస్యతో పాటుగా తన సోదరుడి మరణం ఆయన మరణానికి కారణం.. అలాంటి నటుడు మళ్లీ రారు..