BigTV English

OTT Movie : లిఫ్ట్ అడిగిన అమ్మాయిలకు నరకం చూపించే సైకో… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : లిఫ్ట్ అడిగిన అమ్మాయిలకు నరకం చూపించే సైకో… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలలో మొదటినుంచి చివరి దాకా ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ప్రేక్షకులు బాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు. అటువంటి మూవీలు ఓటీటీ ప్లాట్ఫారంలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “ఈవెన్ లాంబ్స్ హావ్ టీత్” (Even lambs have teeth). ఈ మూవీలో ఇద్దరమ్మాయిలు సైకో కిల్లర్స్ చేతికి చిక్కుతారు. ఆ తరువాత వాళ్లు పడే నరకయాతనతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ కాస్త వైలెంట్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కేట్, సోలన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీళ్లు చదువుకోవడానికి న్యూయార్క్ వెళ్లాలని అనుకుంటారు. డబ్బులు కాస్త అవసరం ఉండడంతో, ఒక నెల రోజులు ఫామ్ హౌస్ లో పనిచేసి, ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లాలనుకుంటారు. మీకు ఏదైనా సమస్య వస్తే ఒక సీక్రెట్ కోడ్ తో మెసేజ్ చేయాలని కేట్ కు జోసన్ అనే అంకుల్ చెప్తాడు. ఈ క్రమంలో వీళ్లు ఆ చోటికి వెళుతూ ఉంటారు. మార్గమధ్యంలో ఒకచోట ఆగిన వీళ్ళకు ఇద్దరు అబ్బాయిలు లెడ్, లూకాస్ పరిచయం అవుతారు. ఆ వ్యక్తులు మేము కూడా అదే దారిలో వెళ్తున్నామంటూ వాళ్లను కారులో ఎక్కించుకుంటారు. ఆ దారి మధ్యలో అమ్మాయిలను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ లెడ్, లూకాస్ ల తల్లి, ఆ అమ్మాయిలకు తినే పదార్థంలో మత్తు కలుపుతుంది. ఆ తర్వాత  వీళ్లను  బోరిస్ అనే సైకో కిల్లర్ చేతికి అప్పజెప్తారు. అక్కడ కేట్, సోలన్ సైకోల చేతిలో నరకయాతన అనుభవిస్తారు. వాళ్లు ఆ అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు.

ఆ సైకోలలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఈ క్రమంలో కేట్ ఫోన్ నుంచి, జోసన్ ఫోన్ కి మెసేజ్ తప్పుగా వస్తుండడంతో వాళ్లు ప్రమాదంలో ఉన్నారని గ్రహిస్తాడు. అతడు ఎఫ్ బి ఐ ఏజెంట్ అని తెలుసుకున్న ఆ సైకో కిల్లర్స్ ఈ అమ్మాయిలను చంపాలని అనుకుంటారు. అయితే ఆరోజు  సైకో కిల్లర్స్ వేరే అమ్మాయిలను కూడా కిడ్నాప్ చేయాలని వెళ్తారు.  వీళ్ళ దగ్గర కాపలాగా ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు.  సమయం చూసుకొని వీళ్ళిద్దరూ అతనిని చంపి, అక్కడ నుంచి బయటికి వస్తారు. ఆ తర్వాత ఈ అమ్మాయిలు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపుతూ వెళ్తారు. జోసన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ సైకో పోలీస్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇస్తాడు. అతడు జోసన్ ను  బంధిస్తాడు. ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తున్న వీళ్ళు జోసన్ ను కాపాడతారా? ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందర్నీ ఏమైనా చేస్తాడా? చివరికి ఈ అమ్మాయిలు న్యూయార్క్ వెళ్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×