OTT Movie : డిజిటల్ మీడియా ఈ రోజుల్లో చాలా పాపులర్ అయింది. ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్లాట్ ఫామ్ లో ఇప్పుడు హర్రర్ సినిమాల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లు, కరెంటు లేని రోజుల్లో దయ్యాలంటే భయపడే వాళ్ళు. అయితే టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా దయ్యాలు ఉన్నాయని భయపడుతూ, చేతబడులను నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓటిటిలో ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ఇండోనేషియన్ మూవీ. ఈ మూవీ పేరు ‘కల్టస్ ఇబ్లిష్‘ (Kultus Iblis). ఈ మూవీలో చేతబడి అంశాలతో పాటు, దయ్యాల విన్యాసాలతో మూవీ లవర్స్ కు చెమటలు పట్టిస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది
స్టోరీ లోకి వెళితే
రేఖ అనే అమ్మాయి తన అన్నను తీసుకొని తండ్రి దగ్గరకు వెళుతుంది. వాళ్లు వెళ్లేముందే రేఖ తండ్రి రక్తపుమడుగులో చనిపోయి ఉంటాడు. రేఖ తండ్రి చేతిలో ఒక మ్యాప్ ఉంటుంది. అందులో ఒక ఆడ మనిషి పేరు, ఆమె అడ్రస్ ఉంటాయి. ఎవరో తన తండ్రిని చేతబడి చేసి చంపేసి ఉంటారని రేఖ భావిస్తుంది. కాసేపటి తర్వాత తండ్రి శవం కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ మ్యాప్ లో ఉన్న ప్రాంతానికి బయలుదేరుతారు. ఈ క్రమంలో ఆ ఊరికి వెళ్తున్న సమయంలో వీళ్లకు కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొన్ని ఆత్మలను దాటుకొని వీళ్లు ఆ ఇంటికి చేరుతారు. అక్కడ ఒక ముసలామె వీళ్లను రిసీవ్ చేసుకుంటుంది. ఆమె ఎవరో కాదు రేఖ నానమ్మ. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది రేఖ. ఆ ఊరిలో శాంతి కోసం పిల్లల్ని నరబలి ఇస్తూ ఉంటారు.
ఎవరైనా నరబలికి పిల్లలను ఇవ్వకపోతే ఆ ఊరు నుంచి తరిమేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు రేఖ తండ్రి పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో ఆ ఊరి నుంచి బయటికి వచ్చేస్తాడు. వాళ్లను మళ్లీ ఊరికి రప్పించి బలి ఇచ్చే క్రమంలో చేతబడి చేసి ఉంటారు. వీళ్లు ఆ ఊరు వచ్చిన తర్వాత వీళ్ళ శరీరాలలో ఆత్మలు ప్రవేశిస్తాయి. వెజిటేరియన్ తినే వీళ్లు నాన్వెజ్ తినడం మొదలుపెడతారు. కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. వీళ్లల్లో ఆత్మలు చేరిన తర్వాత వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి వీళ్లు ఆత్మల నుంచి తప్పించుకోగలుగుతారా? రేఖ తండ్రి మళ్లీ బ్రతుకుతాడా? వాళ్లు ఎందుకు నరబలిస్తున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “కల్టస్ ఇబ్లిష్” (Kultus Iblis) హర్రర్ థ్రిల్లర్ ఇండోనేషియన్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఒంటరిగా మాత్రం చూడలేరు.