OTT Movie : సస్పెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మలయాళం మూవీలను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలలో వచ్చే సస్పెన్స్, ప్రేక్షకులను బాగా థ్రిల్ చేస్తాయి. దృశ్యం సినిమా తర్వాత అటువంటి కంటెంట్ తో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అటువంటి మర్డర్ మిస్టరీ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు ‘గుమస్తాన్’ (Gumasthan). ఈ మూవీలో జైస్ జోష్, బిపిన్ జార్జ్, షాజు శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మర్డర్ మిస్టరీ మూవీకి ఆమల్ కే జాబి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఒక మర్డర్ కేస్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మర్డర్ మిస్టరీ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక లాయర్ వద్ద ఆండ్రూస్ పల్లిప్పదన్ అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. కోర్టు వ్యవహారాలు చక్కగా చూసుకుంటూ లాయర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు ఆండ్రూస్ పల్లిప్పదన్. ఇతనికి లీలా అనే భార్య ఉంటుంది. ఒకరోజు లీలతో ఆండ్రూస్ పల్లిప్పదన్ గొడవ పడతాడు. బంధువుల విషయంలో కొన్ని విషయాల కారణంగా భార్య భర్తల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవలో భార్యను గట్టిగా మందలిస్తాడు ఆండ్రూస్. ఆ మరుసటి రోజు రక్తపు మరకలతో ఉన్న ఆండ్రూస్ ని చూసి పనిమనిషి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. ఆమె భార్య కనపడకుండా పోవడంతో లీలా ను భర్త హత్య చేశాడని పోలీసులు భావిస్తారు. పైగా పోలీస్ ఇన్స్పెక్టర్ తో ఆండ్రూస్ పల్లిప్పదన్ కి వివాదాలు ఉంటాయి. అతని మీద కక్ష పెంచుకున్న ఇన్స్పెక్టర్ ఈ కేసు విషయంలో అతనిని వేదిస్తాడు. తన తెలివితేటలతో ఈ కేసు నుంచి బయటికి రావాలని చూస్తూ ఉంటాడు ఆండ్రూస్ పల్లిప్పదన్.
ఇలా జరుగుతున్న క్రమంలో ఆండ్రూస్ భార్య తిరిగి ఇంటికి వస్తుంది. ఈ విషయంతో పోలీసులు షాక్ తింటారు. ఆ తర్వాత ఆండ్రూస్ పల్లిప్పదన్ కొడుకును ఎవరో చంపుతారు. కొడుకు చావుకు ప్రతికరం తీర్చు కోవాలనుకుంటాడు పల్లిప్పదన్. ఈ క్రమంలో పల్లిప్పదన్ తన తెలివితేటలను వాడుతాడు. పల్లిప్పదన్ తన కొడుకును చంపిన వాళ్ళని వెతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి పల్లిప్పదన్ ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఎవరు? తన కొడుకును చంపిన వాళ్ళపై పల్లిప్పదన్ ప్రతికారాన్ని తీర్చుకుంటాడా? పోలీసులు పల్లిప్పదన్ ను ఏ విధంగా ఇరికిస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గుమస్తాన్’ (Gumasthan) మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.