BigTV English
Advertisement

OTT Movie : చేతబడితో డబ్బులే డబ్బులు… ట్విస్టుల మీద ట్విస్ట్ లున్న హర్రర్ మూవీ

OTT Movie : చేతబడితో డబ్బులే డబ్బులు… ట్విస్టుల మీద ట్విస్ట్ లున్న హర్రర్ మూవీ

OTT Movie : హర్రర్ మూవీస్ కి ఓటీడీలో ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది. అప్పట్లో ఈవిల్ డెడ్, ఎగ్జార్సిస్ట్ హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అలానే మేకర్స్ ఏదో ఒక రూపంలో హర్రర్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి మూవీస్ లో చేతబడికి సంబంధించిన చాలా మూవీస్ వచ్చాయి. అయితే మనం చెప్పుకోబోయే మూవీలో చేతబడి ద్వారా అంతులేని ధనాన్ని సృష్టించడమే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ మూవీ సజెషన్. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


భయపడేవాళ్ళు జాగ్రత్త 

ఇదొక భయంకరమైన హర్రర్ థ్రిల్లర్ మూవీ. చీకటి, దయ్యాలంటే భయపడే వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు మరేమిటో కాదు ‘భాయి అజీబ్‘.


స్టోరీ లోకి వెళితే.. 

హీరో ఒక వజ్రం ద్వారా పెద్ద ధనవంతుడిగా మారుతాడు. ఆ ధనంతో అతనొక గొప్ప వ్యక్తిగా మారుతాడు. అతని భార్య గర్భవతిగా ఉంటుంది. అతడు ధనవంతుడైన తర్వాత అదే ఊరిలో ఒక భవనాన్ని కొని, అందులో తన భార్యని ఉంచుతాడు.  ఇది ఇలా ఉండగా అదే ఊరిలో ఆల్బర్ట్ అనే వ్యక్తి సమాధిని డోర్మెన్ త్రవ్వి, అతని పుర్రెను తీసుకొని ఆ పుర్రెతో తనకు తెలిసిన తంత్ర విద్యలతో అంతులేని సంపదను సృష్టించాలనుకుంటాడు. అయితే అతడు ఆ సంపదను సృష్టిస్తాడు… కానీ అవి ఎండిపోయిన ఆకులు వలె మారిపోతాయి. డోర్మన్ ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ఓ అదృశ్య శక్తి అతనితో మాట్లాడుతూ ఈ సంపద కావాలంటే నర బలి కావాలని చెప్తుంది. అయితే అదే రోజు గ్రహణం ఉండడంతో బయటకి రావడానికి మనుషులు భయపడతారు. ఈ విషయం తెలియని హీరో భార్య డాక్టర్ చెకప్ కోసం అడవి మార్గం ద్వారా బయలు దేరుతుంది.

డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో ఆల్బర్ట్ సమాధిలో పడిపోతుంది. ప్రమాదంలో ఉన్న తన భార్యని హీరో కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇదే క్రమంలో పురిటి నొప్పులతో ఓ సంచిని ప్రసవిస్తుంది హీరోయిన్. ఆ సంచిలో పసి బాలుడు ఉన్నాడని అనుకుంటారు. గ్రహణం తర్వాత ఆ సంచిని తెరిచి చూడగా, అందులో మొండెం లేని ఒక తల మాత్రమే ఉంటుంది. ఈ తల ఆ భార్యాభర్తలని ఏం చేస్తుంది? డోర్మేన్ తను అనుకున్న డబ్బుని, సంపదని సృష్టించగలిగాడా ? అనే విషయాలు తెలియాలంటే ఓటిటిలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఇదొక కొత్త కంటెంట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి డోంట్ మిస్. రీసెంట్ గా అల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ‘తుంబాడ్’ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా అలాంటిదే.

Tags

Related News

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

Big Stories

×