BigTV English
Advertisement

OTT Movie : స్వర్గం, నరకాన్ని నమ్ముతారా? ఈ మూవీని డోంట్ మిస్… వణుకు పుట్టించే హర్రర్ మూవీ

OTT Movie : స్వర్గం, నరకాన్ని నమ్ముతారా? ఈ మూవీని డోంట్ మిస్… వణుకు పుట్టించే హర్రర్ మూవీ

OTT Movie : దెయ్యాలు ఉన్నాయా లేవా ? అనేది ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్కో స్వర్గం, నరకం ఉన్నావా లేదా అనేది కూడా అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే టాపిక్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కిన మూవీనే ఈరోజు మన ఓటీటీ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి…


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

హారర్ సినిమాలు ఓటిటిలో భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో స్వర్గం, నరకం అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చాలా అరుదు. ఇక ఇలాంటి స్టోరీలు చదవడానికి, వినడానికి ఎంతో ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా దేవుడిని నమ్మేవారు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారని, పాపాలు చేస్తే నరకానికి వెళ్తారని గట్టిగా నమ్ముతారు. అయితే ఇక్కడ స్వర్గం కంటే నరకం గురించి చెప్పే కథలు భయంకరంగా ఉంటాయి. నరకానికి వెళ్తే వేడి వేడి నూనెలో వేయిస్తారని, దారుణంగా టార్చర్ చేస్తారని రకరకాల శిక్షలు వేస్తారని కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇక వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళ్తే..

ఈ సినిమాలో ఒక కపుల్, వాళ్లకు నలుగురు పిల్లలు ఉంటారు. అందులో ఇద్దరు మగ పిల్లలు ఉంటే మరో ఇద్దరు ఆడపిల్లలు. ఇక ఈ దంపతుల పని ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లి ఆ కార్యక్రమాలను జరిపించడం. ఇలాంటి పనిని ఉద్యోగంలా చేస్తున్న క్రమంలో ఓ మహిళ చనిపోవడంతో ఆమె అంతిమ సంస్కారాల కోసం ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీలో ఉండే పిల్లలు చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే నరకానికి వెళ్తారు లేదంటే స్వర్గానికి వెళ్తారు అని స్టోరీలను వింటూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చనిపోయిన ఆ మహిళ చావు కార్యక్రమంలో ఆమె స్వర్గానికి వెళ్తుందా ? లేక నరకానికి వెళ్తుందా? అనే టాపిక్ గురించి నలుగురు పిల్లల మధ్య డిస్కషన్ జరుగుతుంది. అయితే సడన్ గా ఒక అమ్మాయికి చనిపోయిన డెడ్ బాడీని ఎవరో కట్టేసినట్టుగా కనిపించడంతో షాక్ అవుతుంది.

విషయం ఏమిటంటే ఆ సీన్ ఆ పిల్లకు తప్ప ఇంకెవరికి కనబడదు. దీంతో ఆ అమ్మాయి భయపడుతూ చనిపోయిన మహిళ నరకంలో ఉందంటూ అందరి ముందు గట్టిగా అరుస్తుంది. దీంతో అక్కడ అందరూ షాక్ అవ్వగా, ఆ పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత కథ పది ఏళ్ల ముందుకు సాగుతుంది. పిల్లలందరూ లైఫ్ లో సెటిల్ కాగా, చిన్న పిల్ల మాత్రం సింగర్ కావాలని కోరుకుంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా కాంపిటీషన్లో కూడా పాల్గొంటుంది.. అయితే సరిగ్గా అదే టైంలో ఆమెకు ఊహించని సంఘటన ఎదురవుతుంది. మరోవైపు డెత్ సెర్మనికి వెళ్లిన తల్లిదండ్రుల ముందు బాడీ లేచి అరిచి భయపెడుతుంది. అసలు ఆ ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది? అనే విషయాలు తెలియాలంటే ‘శిక్సా నేరక‘ అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

OTT Movie : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

OTT Movie : యూకేలోని అతిపెద్ద కుంభకోణం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

Big Stories

×