BigTV English

Bigg Boss 8 Telugu: ఇంట్లో చెప్పకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి గౌతమ్.. క్షమించండి నాన్న అంటూ కన్నీళ్లు

Bigg Boss 8 Telugu: ఇంట్లో చెప్పకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి గౌతమ్.. క్షమించండి నాన్న అంటూ కన్నీళ్లు

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చాడు డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ. ఆ సీజన్‌లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చిన ఒకే ఒక్క కంటెస్టెంట్ తను. సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత గౌతమ్ ఆట మరింత ఇంప్రూవ్ అయ్యిందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తన ఫ్యాన్స్ అనుకున్నట్టుగానే తను టాప్ 5 వరకు రాలేకపోయాడు. సీజన్ మొదటి నుండి తానే విన్నర్ అవుతాననుకుంటూ ఉన్న గౌతమ్.. ఖాళీ చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్లాడు. ఈసారి అలా జరగకూడదు అని బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు గౌతమ్. కానీ తను హౌస్‌లోకి వచ్చిన తర్వాతే ప్రేక్షకులకు అసలు విషయం తెలిసింది.


సీరియస్‌‌గా తీసుకున్నాడు

బిగ్ బాస్ సీజన్ 8లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ఎంటర్ అయ్యారు. కానీ అందులో మెజారిటీ సీజన్ 7కు చెందినవారే ఉన్నారు. అందులో ఒకరు గౌతమ్ కృష్ణ. తను సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి మంచి ఫ్యాన్ బేస్, లేడీస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా కూడా చివరివరకు ఉండలేకపోయాడు. కనీసం ఈసారి ఎలా అయినా ట్రాఫీ గెలవాలి అనే కసితో హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మూడో రోజే ఏడ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కామెడీ టాస్క్‌ను సీరియస్‌గా తీసుకొని ఆడకుండానే మధ్యలో వెళ్లిపోయిన గౌతమ్.. ఒంటరిగా వెళ్లి కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ గౌతమ్ అనగానే చాలామంది ప్రేక్షకులకు కూడా గుర్తొచ్చే పదం ‘అశ్వద్ధామ 2.0’.


Also Read: బిగ్ బాస్ పై జాతీయ సంస్థ ఫైర్… ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపాలంటూ డిమాండ్

హర్ట్ అయ్యాడు

సీజన్ 7లో సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత తాను అశ్వద్ధామగా తిరిగొచ్చానని చాలా ఎమోషన్‌తో చెప్తూ వచ్చాడు గౌతమ్. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఆ డైలాగ్.. బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఒక ఫన్నీ టాస్క్‌లో గౌతమ్‌ను నవ్వించడం కోసం ఆ పదాన్ని ఉపయోగించాడు అవినాష్. అది గౌతమ్‌కు నచ్చలేదు. టాస్క్ మధ్యలోనే ఆపేశాడు. ఊరికే ఆ పదం వాడకూడదని, కుదరదు అంటే ఇప్పుడే బయటికి వెళ్లిపోతానని మైక్ పడేసి వెళ్లిపోయాడు. అవినాష్ వెళ్లి సారీ చెప్పగా.. తాను సాధారణంగా ఏడవను అని, కానీ బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత అదే డైలాగ్‌పై తనను ట్రోల్ చేయడం వల్ల చాలా ఫీలయ్యానని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గట్టిగా ఆడతాను

సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా గౌతమ్ రాగానే అందరూ తనను చూసి అశ్వద్ధామ 2.0 అనడం మొదలుపెట్టారు. అలా అంటే తాను ఫీలవుతానని చాలామందికి పర్సనల్‌గా చెప్పాడు. ఆ విషయం అవినాష్‌కు తెలియక దానిని టాస్క్‌లో ఉపయోగించినందుకు గౌతమ్‌కు మనస్ఫూర్తిగా సారీ చెప్పాడు. వెంటనే గౌతమ్ ఇంటరిగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి మళ్లీ ఏవడవం మొదలుపెట్టాడు. ‘‘సారీ నాన్న. ఇక్కడికి వచ్చేముందు మీతో గొడవ పెట్టుకున్నాను, మాట్లాడకుండానే వచ్చేశాను. ఈసారి ఎలాగైనా కప్ కొడతాను. గట్టిగా ఆడతాను’’ అని తనను తాను మోటివేట్ చేసుకున్నాడు. దీంతో గౌతమ్ అసలు ఎమోషనల్ అవ్వడానికి కారణమేంటో ప్రేక్షకులకు అర్థమయ్యింది.

Related News

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Big Stories

×